Pushpa 2: పుష్పరాజ్‌ హంగామా మళ్లీ మొదలు కానుంది.. సీక్వెల్ షూటింగ్ ఎప్పటి నుంచంటే..

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. భాషతో సంబంధం...

Pushpa 2: పుష్పరాజ్‌ హంగామా మళ్లీ మొదలు కానుంది.. సీక్వెల్ షూటింగ్ ఎప్పటి నుంచంటే..
Pushpa 2 shooting
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2022 | 2:08 PM

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్పరాజ్‌ మేనరిజానికి ఫిదా అయ్యారు. ముఖ్యంగా బన్నీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సుకుమార్‌ మార్క్‌ దర్శకత్వం, బన్నీ నటనకు దేశమంతా ఉర్రూతలూగింది. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్‌లు ఓ రేంజ్‌లో క్లిక్‌ అయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప ది రూల్‌ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పుష్ప తొలి పార్ట్‌ విడుదలై ఇప్పటికే దాదాపు ఏడాది దగ్గరపడుతోన్న నేపథ్యంలో సీక్వెల్‌ కోసం ప్రేక్షకులకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడూ పుష్ప2 వస్తుందా అని కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల్లోని ఫ్యాన్స్‌ కూడా క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే నిజానికి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణలతో వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి అల్లు అర్జున్‌ మరో సినిమాకు సైన్‌ చేయకపోయినప్పటికీ, సుకుమార్‌ కొత్త ప్రాజెక్ట్‌ మొదలు పెట్టక పోయినప్పటికీ పుష్ప2 చిత్రీకరణ వాయిదా పడుతోంది.

అయితే అభిమానుల ఎదురుచూపులకు త్వరలోనే ఫుల్ స్టాప్‌ పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న పుష్ప సీక్వెల్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది టాక్‌. ప్రస్తుతం తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం సుకుమార్‌ ఏకంగా హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ను దింపుతున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

అడవి నేపథ్యంలో అడ్వెంచర్‌ ఫైట్‌లు ఇందులో ఉండనున్నటాయని టాక్‌. ఇదిలా ఉంటే పుష్ప సీక్వెల్‌పై మరింత దృష్టి సారించిన సుకుమార్‌ ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురు బాలీవుడ్‌ నటులను రంగంలోకి దింపనున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి పుష్ప సీక్వెల్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మూవీ రిలీజ్‌ వరకు వేచి చూడాల్సిందే.

ఇక మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ చిత్రంలోనూ రష్మికానే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తొలిపార్ట్‌లో ఐటెం సాంగ్‌ సమంత ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ సెకండ్ పార్ట్‌లో స్పెషల్‌ సాంగ్‌కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌కు డాన్‌గా ఎదిగిన పుష్పరాజ్‌కు, పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్ షెకావత్‌ల మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా సీక్వెల్‌ చిత్రం తెరకెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..