AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR-Balakrishna: సీఎం జగన్ నిర్ణయం పై అబ్బాయ్ అలా.. బాబాయ్ ఇలా.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

ఏపీలో హెల్త్ యూనిర్సిటీ పేరు మార్పు రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్‌.ఆర్ పేరును పెట్టడం ఇప్పుడో పెద్ద వివాదంగా మారింది.

NTR-Balakrishna: సీఎం జగన్ నిర్ణయం పై అబ్బాయ్ అలా.. బాబాయ్ ఇలా.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
Ntr, Balakrishna
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2022 | 9:40 PM

Share

ఏపీలో హెల్త్ యూనిర్సిటీ పేరు మార్పు రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్‌.ఆర్ పేరును పెట్టడం ఇప్పుడో పెద్ద వివాదంగా మారింది. కొందరు తెలుగు తమ్ముళ్ల రక్తం మరిగేలా చేస్తోంది. ఇక ఇదే విషయం పై కొద్దీ రోజుల కిందట జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR) కూడా రియాక్ట్‌ అయ్యారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు అంటూ చిన్న ట్వీట్‌ మాత్రమే చేశారు. పేరు మార్పు వైఎస్‌ఆర్‌ గౌరవం పెంచదని, ఆలా అని ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదని వ్యాఖ్యానించారు తారక్. ఎన్టీఆర్‌పై ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపివేయలేరని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు జూనియర్‌ ఎన్టీఆర్‌. అయితే తారక్ ట్వీట్‌ పై పెదవి విరిచారు కొందరు తెలుగు తమ్ముళ్లు. జగన్ తీరుపై సింహాద్రిలా సీరియస్ అవుతారని అనుకుంటే.. స్టూడెంట్ నెంబర్ 1లో హీరోలా సర్థిచెప్పడం ఏంటని.. నెట్టింట ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు. అయితే తారక్ సౌమ్యంగా స్పందించారని అంటున్నారు తారక్ వీరాభిమానులు. వివాదానికి తావివ్వకుండా తారక్ రియాక్ట్ అయ్యారని అంటున్నారు.

కాని తెలుగు తమ్ముళ్లు అనుకున్నట్టు.. అబ్బాయి ట్వీట్‌కు పర్లాంగు దూరమన్నట్టు తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు బాబాయ్ బాలయ్య. జగన్ తీరుపై… ఆయన ఒంటెద్దు పోకడలపై విపరీతంగా సీరియస్‌గా అయ్యారు. జగన్‌తో పాటు.. మరొకొందరి నేతలపై కూడా పరోక్ష విమర్శలు చేశారు. “అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్‌. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు” అంటూ వారందరిపై నిప్పులు చెరిగారు బాలయ్య. ఇప్పుడు బాలయ్య కామెంట్స్ సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతున్నాయి. జగన్ నిర్ణయం పై అబ్బాయ్ అలా బాబాయ్ ఇలా స్పందించడం పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే