AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ కోసం హాలీవుడ్ హీరోలను దింపుతున్న జక్కన్న.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరలవుతుంది. మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ హీరోను రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది.

Mahesh Babu: మహేష్ కోసం హాలీవుడ్ హీరోలను దింపుతున్న జక్కన్న.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..
Mahesh Babu, Chris Hemsworth
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2022 | 1:09 PM

Share

ప్రస్తుతం మహేష్ బాబు Mahesh Babu() మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మహేష్ కెరీర్‎లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‏గా రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా జక్కన్న, మహేష్ మూవీపై ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. మహేష్‏తో తాను చేయబోయే సినిమా గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలిపాడు. దీంతో ఈ సినిమా మీద మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరలవుతుంది. మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ హీరోను రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్‏వర్త్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. అంతేకాకుండా మరికొందరు హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ ప్రాజెక్టులో భాగంకాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల డైరెక్టర్ రాజమౌళి.. ప్రముఖ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ (CAA)లో భాగమైన తర్వాత ఈ రూమర్స్ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యారు. అలాగే మహేష్, జక్కన్న కాంబోలో రాబోతున్న చిత్రం ఆఫ్రికన్ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ అని.. ఇందులో చాలా యాక్షన్, థ్రిలింగ్ ఉంటుందని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!