Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: భారత క్రికెటర్లను ఇంటికి ఆహ్వానించిన రామ్‌ చరణ్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు!

ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించిన భారత్‌ క్రికెటర్లకు, మ్యాచ్ అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ ఇంట్లో ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు..

Ram Charan: భారత క్రికెటర్లను ఇంటికి ఆహ్వానించిన రామ్‌ చరణ్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు!
Ram Charan, Hardik Pandya
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2022 | 1:15 PM

Indian players visited Ram Charan’s house: ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించిన భారత్‌ క్రికెటర్లకు, మ్యాచ్ అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ ఇంట్లో ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. మ్యాచ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ఇండియన్‌ క్రికెటర్లు.. హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లు రామ్‌ చరణ్‌ ఆహ్వానం మేరకు ఇంటికి చేరుకొని సందడి చేశారు. క్రికెటర్లను రామ్ చరణ్ సన్మానించి, వారితో కాసేపు ముచ్చటించాడు. మెగా కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి విచ్చేశారు. ఈ పార్టీలో హార్దిక్‌ పాండ్య ఓ వ్యక్తితో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రామ్‌ చరణ్‌ ఇంట జరిగిన విందుకు సంబంధించిన ఫొటోలు కూడా త్వరలో అధికారికంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలను సత్కరించడంతో రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తున్నాడనే చెప్పాలి.

గతంలో కూడా మెగాస్టార్‌ ఎందరో క్రీడా, పొలిటికల్‌ సెలబ్రెటీలకు ఆతిధ్యమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఈ సంప్రదాయాన్ని చరణ్‌కూడ కొనసాగిస్తున్నాడు. కాగా రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత శంకర్‌ డైరెక్షన్‌లో పొలిటికల్, సామాజిక అంశాలతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ స్పెషల్‌ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మువీ మేకింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి
Hardik Pandya

Hardik Pandya

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి.