PVNRTVU Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో స్పెషలిస్టు పోస్టులు.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన వెటర్నరీ, వెటర్నరీ మెడిసిన్, ప్లాంట్ ప్రొటెక్షన్, ఫిషరీస్ విభాగాల్లో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి (Specialist posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
PVNRTVU Hyderabad Specialist Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన వెటర్నరీ, వెటర్నరీ మెడిసిన్, ప్లాంట్ ప్రొటెక్షన్, ఫిషరీస్ విభాగాల్లో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి (Specialist posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెటర్నరీ సైన్స్‌లో ఐదేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/అగ్రికల్చర్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ఫిషరీస్ సైన్స్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 10, 2022వ తేదీన ఉదయం 11 గంటలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావచ్చు. యూజీసీ సీఎస్ఐఆర్ నెట్‌లో వ్యాలిడ్ స్కోర్ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు భాషలో మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100లతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Administrative Building, PV Narasimha Rao Telangana Veterinary University, Rajendranagar, Hyderabad – 500 062.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.