IIT Recruitment 2022: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బోధ్‌పుర్‌లోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bodhpur).. 153 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Non Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
IIT Bodhpur Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బోధ్‌పుర్‌లోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bodhpur).. 153 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Non Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బయోసైన్స్ అండ్ బయోఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, హిందీ ఆఫీసర్, కౌన్సెలర్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఎల్‌ఎల్‌బీ/ఎంబీబీఎస్/బీటెక్/బీఈ/బీఎస్సీ/ఎంఏ/ఎంఈ/ఎంటెక్/ఎండీ/ఎంఎస్/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 27 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 17, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.21700ల నుంచి రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.