BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంగ్లిష్‌ టైపింగ్ వచ్చి ఉంటే చాలు..

BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL)లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...

BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంగ్లిష్‌ టైపింగ్ వచ్చి ఉంటే చాలు..
Becil Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2022 | 8:22 PM

BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL)లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పని చేయుటకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ గ్రేడ్‌-01, ఎంటీఎస్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లిష్‌ టైపింగ్‌ నైపుణ్యం కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లై, ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను DSCSC2022@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలి.

* అభ్యర్థులను వీడియో కాన్ఫరెన్స్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 28-09-2022 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..