ECIL Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా..

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL Hyderabad).. 284 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల (ITI Trade Apprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ECIL Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా..
Ecil Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2022 | 11:36 AM

ECIL Hyderabad ITI Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL Hyderabad).. 284 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల (ITI Trade Apprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్, ఆర్‌ అండ్ ఏసీ, ఎమ్‌ఎమ్‌వీ, టర్నర్‌, మెషినిస్ట్, ఎమ్‌ఎమ్‌ టూల్ మింట్‌, కార్పెంటర్‌, కోపా, డీజిల్‌ మెక్‌, ప్లంబర్‌, ఎస్‌ఎమ్‌ఎమ్‌, వెల్డర్‌, పెయింటర్‌ తదితర ట్రేడుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 31, 2022వ తేదీ నాటికి 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 10, 2022వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 27, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్హతలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కింది అడ్రస్‌లో అక్టోబర్‌ 20 నుంచి 28 వరకు జరుగుతుంది. అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7700ల నుంచి రూ.8050ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL Hyderabad – 500 062.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.