SBI Recruitment 2022: ఎస్బీఐలో 5008 క్లర్క్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు..

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంక్‌ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 5,008 జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల (Junilr Associate Posts)కు దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే వెంటనే దరఖాస్తు..

SBI Recruitment 2022: ఎస్బీఐలో 5008 క్లర్క్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు..
SBI
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 27, 2022 | 8:21 AM

SBI Clerk Recruitment 2022: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంక్‌ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 5,008 జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల (Junilr Associate Posts)కు దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే ముగుస్తుంది. హైదరాబాద్‌లో 225 వరకు ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీనాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆగస్టు 2, 1994 నుంచి ఆగస్టు 1, 2022వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 27, 2022వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్‌) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్‌ 2022లో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష డిసెంబర్‌ 2022 లేదా జనవరి 2023లో జరుగుతుంది. ఎంపికైన వారు నెలకు రూ.19.900ల జీతంతో ఉద్యోగాలు పొందవచ్చు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు, 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు గంట సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కుల చొప్పున పరీక్ష జరుగుతుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్‌ పరీక్ష రాయడానికి అర్హులు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.