- Telugu News Photo Gallery Avocado Benefits for Skin: Avocado makes your skin glowing naturally, know here in detail
Beauty Tips: చిన్న వయసులోనే చర్మంపై ముడుతలు ఏర్పడ్డాయా? అవకాడో పండుతో ఇలా చేశారంటే..
చర్మ సంరక్షణకు మగువలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి సత్ఫలితాలు రాకపోవచ్చు. దెబ్బతిన్న చర్మానికి చక్కని చికిత్సనందించడంలో అవకాడో ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. అవకాడోతో ఫేస్ మాస్కులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..
Updated on: Sep 25, 2022 | 11:47 AM

చర్మ సంరక్షణకు మగువలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి సత్ఫలితాలు రాకపోవచ్చు. దెబ్బతిన్న చర్మానికి చక్కని చికిత్సనందించడంలో అవకాడో ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. అవకాడోతో ఫేస్ మాస్కులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..

అవకాడో-అలోవెరా: ముందుగా అవకాడో గుజ్జును తీసుకుని అందులో అలోవెరా జెల్ కలుపుకోవాలి. ఈ రెండింటినీ పేస్ట్‌లా కలుపుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి.

అవకాడో-తేనె: అవకాడో గుజ్జులో, తేనె, రోజ్ వాటర్ బాగా కలుపుకోవాలి. ముఖం శుభ్రంగా కడుక్కుని ఈ పేస్ట్‌ను అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మీ చర్మం సహజకాంతితో మెరిసిపోతుంది.

చర్మంపై ముడతలను తొలగించడంలో కూడా అవకాడో సహాయపడుతుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది. అవకాడోలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల, చర్మ ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పొడి చర్మం కలిగిన వారు.. అవకాడో నూనె వాడటం వల్ల, చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.