- Telugu News Photo Gallery Quit Smoking Using Black Pepper: How To Use Black Pepper To Quit Smoking, know its amazing benefits
How To Quit Smoking: నల్ల మిరియాలతో స్మోకింగ్ అలవాటును ఇలా దూరం చేసుకోండి
ఆహార రుచికే కాకుండా శరీరానికి, మనసుకు కూడా నల్ల మరియాలు ఎంతో మేలు చేస్తాయి. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేయడంలో..
Updated on: Sep 25, 2022 | 12:18 PM

ఆహార రుచికే కాకుండా శరీరానికి, మనసుకు కూడా నల్ల మరియాలు ఎంతో మేలు చేస్తాయి.

నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేయడంలో మిరియాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుదలకు నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి.

ఆయుర్వేదంలో కూడా నల్ల మిరియాలను వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషధ గుణాలు పిల్లలు, పెద్దలు అందరికీ మేలు చేస్తాయి.

కీళ్ళు, పేగుల్లో మంటను నివారించడంలో నల్ల మిరియాలు సహాయపడతాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా.. నల్ల మిరియాలు స్మోకింగ్ అలవాటును మానివేయడానికి ఎంతో సహాయపడతాయి. ఇది క్యాన్సర్‌ను నివారించే లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి.





























