- Telugu News Lifestyle Fashion Navaratri 2022: fashion tips try these lehenga choli designs to get ready for a traditional look in dussehra festival
Fashion Tips: దసరాకు సాంప్రదాయ దుస్తులను ధరించాలనుకుంటున్నారా.. ఈ లెహంగా చోలీలను ప్రయత్నించండి
నవరాత్రులంటేనే మహిళలకు ప్రత్యేకం. బతుకమ్మ సంబరాలు, గర్బా , దుర్గాపూజలో చాలా మంది మహిళలు సాంప్రదాయ రూపంలో కనిపించడానికి ఆసక్తిని చూపిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు.. నేటి యువత అభిరుచికి అడ్డం పట్టేలా ఈ సమయంలో ఎలాంటి డ్రెస్ ధరించాలి.. మీ వార్డ్‌రోబ్‌లో ఏ రకమైన లెహెంగా, చోలీని చేర్చుకోవచ్చు తెలుసుకుందాం..
Updated on: Sep 25, 2022 | 5:00 PM

నవరాత్రులు రేపటి నుంచి అంటే సెప్టెంబరు 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మహిళలు దుర్గాపూజలో పాల్గొంటారు. మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. మీరు లెహంగా, చోలీ కూడా ధరించవచ్చు. మీరు ఎటువంటి లెహంగా చోలీ డిజైన్‌లను ఎంపిక చేసుకోవచ్చో తెలుసుకుందాం

నవరాత్రులలో రెడ్ కలర్ లెహంగా, చోలీ బెస్ట్ ఎంపిక. ఇందుకు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ లెహంగాని ఉదాహరణగా తీసుకోవచ్చు.ఈ లెహంగాతో పాటు అందమైన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంది. జుట్టును అందంగా అలంకరించుకోవచ్చు. పెద్ద పెద్ద చెవిపోగులు మరింత అందాన్ని ఇస్తాయి.

మీరు పూల ప్రింట్ లెహంగాను ధరించాలనుకుంటే.. మాధురీ దీక్షిత్ డ్రెస్సింగ్ స్టైల్ ను పాటించవచ్చు. గ్రీన్ కలర్ లెహంగా అద్దాలు, అందమైన ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా అందరిని ఆకట్టుకుంటుంది.

మీరు ఆలియా ధరించిన నియాన్ గ్రీన్ కలర్ లెహంగా కూడ దసరా పండక్కి బెస్ట్ ఎంపిక. కాంట్రాస్టింగ్ బ్లౌజ్‌తో లెహంగాకు మరింత ట్రెడిషనల్ లుక్ వచ్చింది. ఈ లెహంగాకు భారీ నగలతో మరింత అందం సొంతం అవుతుంది.

నియాన్ గ్రీన్ , పింక్ రంగుల పువ్వులు, చెవ్రాన్ ప్రింట్‌లతో కూడిన లెహెంగాను శిల్పాశెట్టి ధరించింది. ఈ మోడ్రన్ లుక్ ని మిక్స్డ్ చేసి.. సంప్రదాయంగా కనిపించే ఈ డ్రెస్ కూడా దసరాకు బెస్ట్ ఎంపిక. జుట్టును బన్‌తో అలంకరించి మరింత అందంగా అలంకరించుకోవచ్చు. డ్రెస్ కు తగిన గాజులను, నగలను ధరిస్తే.. మరింత అందం మీ సొంతం అవుతుంది.





























