- Telugu News Photo Gallery Technology photos Boat launches new smartwatch with low price Boat Wave Style features and price details Telugu Tech News
BoAt Wave Style: తక్కువ బడ్జెట్‌లో బోట్ స్మార్ట్ వాచ్.. ఫీచర్ల విషయంలో మాత్రం అదుర్స్..
BoAt Wave Style: ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసకునే క్రమంలో బోట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు..
Updated on: Sep 25, 2022 | 11:14 AM

భారత్‌కు చెందిన ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ బోట్ తాజాగా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

బోట్ వేవ్ స్టైల్ వాచ్‌లో 1.69 ఇంచెస్ స్క్వేర్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 24/7 హార్ట్ రేట్ సెన్సార్, SPO2 మానిటర్లు అమర్చారు. ఇదిలా హార్ట్‌బీట్‌తో పాటు స్ట్రెస్ లెవల్స్‌ను కూడా గుర్తిస్తుంది.

ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు నిరంతరాయంగా నడుస్తుంది.

ఈ వాచ్‌లో ప్రత్యేకంగా బోట్ క్రెస్ట్ అనే యాప్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించారు. స్లీప్ ట్రాకర్, గైడెడ్ బ్రీతింగ్ సెషన్స్, సెడెంటరీ నోటిఫికేషన్స్, 10 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ వంటివి ఈ వాచ్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1299కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వాచ్‌లు అమెజాన్‌తో పాటు బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.





























