Asus Vivobook 14 Touch: అసుస్ నుంచి మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Narender Vaitla |
Updated on: Sep 24, 2022 | 11:20 AM
Asus Vivobook 14 Touch: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ అసూస్ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. అసూస్ వివోబుక్ 14 టచ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో టచ్ స్క్రీన్‌ను అందించారు..
Sep 24, 2022 | 11:20 AM
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఆసుస్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. అసూస్ వివోబుక్ 14 టచ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి.
1 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్ కోర్ 12 జనరేషన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 49,990 నుంచి ప్రారంభమవుతుంది.
2 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో 14 టచ్ 16GB RAM, 512GB PCIe Gen 3 SSDని అందించారు. దీనిని కేవలం 19.9mm మందంతో తయారు చేయడం విశేషం.
3 / 5
ఫుల్ సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం డెడికేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లన ప్రత్యేకంగా అందించారు. కోర్ i5-1240p ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకగా చెప్పొచ్చు.
4 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో కూడిన 42 డబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది.