AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimers: అల్జీమర్స్‌కు చికిత్స లేదనే విషయం మీకు తెలుసా? ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి! లేదంటే ఎప్పటికీ..

వయసు పెరగే కొద్దీ మతి మరుపు రావడం సర్వసాధారణం. ఐతే కోవిడ్‌ మహ్మారి కారణంగా ఇప్పుడు మతిమరుపు అన్ని వయసుల వారిని వేధిస్తోంది. జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటే, చిన్న విషయాలు కూడా మరచిపోతే ఏ పని మీద శ్రద్ధ చూపలేరు. ఈ విధమైన లక్షణాలున్న వ్యాధిని..

Alzheimers: అల్జీమర్స్‌కు చికిత్స లేదనే విషయం మీకు తెలుసా? ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి! లేదంటే ఎప్పటికీ..
Alzheimers Symptoms
Srilakshmi C
|

Updated on: Sep 25, 2022 | 2:13 PM

Share

How to Cure Alzheimers: వయసు పెరగే కొద్దీ మతి మరుపు రావడం సర్వసాధారణం. ఐతే కోవిడ్‌ మహ్మారి కారణంగా ఇప్పుడు మతిమరుపు అన్ని వయసుల వారిని వేధిస్తోంది. జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటే, చిన్న విషయాలు కూడా మరచిపోతే ఏ పని మీద శ్రద్ధ చూపలేరు. ఈ విధమైన లక్షణాలున్న వ్యాధిని అల్జీమర్స్ అని పిలుస్తారు. గతంలో కేవలం వృద్ధులకు మాత్రమే ఈ వ్యాధి వచ్చేది. కోవిడ్ మహమ్మారి కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. చాలా మంది చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నారు. కరోనా వైరస్ మెదడు పనితీరును దెబ్బతీయడం వల్ల, ఈ పరిస్థితికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి తాలూకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రారంభంలో.. ఏ విషయంపై శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా 65 కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కన్పిస్తాయి. వయసుతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరినీ మతిమరుపు కలవరపెడుతోంది.

ప్రారంభ లక్షణాలు ఇలా ఉంటాయి..

  • ముఖ్యమైన విషయాలను మరచిపోవడం
  • చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడంలో ఇబ్బంది తలెత్తడం
  • పని, ఇతర సామాజిక విషయాల పట్ల ఆసక్తి కొరవవడం
  • మానసిక స్థితి, వ్యక్తిత్వంలో మార్పులు

ఆ తర్వాత కన్పించే లక్షణాలు ఇలా ఉంటాయి..

ఇవి కూడా చదవండి
  • సీరియస్‌ మూడ్‌
  • జ్ఞాపకశక్తి కోల్పోవడం
  • మాట్లాడటం, మింగడం, నడవడంలో ఇబ్బంది
  • కన్‌ఫ్యూజన్‌గా ఉండటం

అల్జీమర్స్‌కు చికిత్స లేదు

అల్జీమర్స్‌ వ్యాధికి ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఐతే ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే, వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని డాక్టర్ వినీత్ సూచిస్తున్నారు. ఎవరికైనా అల్జీమర్స్ సమస్య ఉంటే, వారిని మామూలు వ్యక్తులుగా మార్చడంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పాత్ర కీలకమైనది. అల్జీమర్స్ లక్షణాలు తీవ్రతరమైతే రోగి తన రోజువారీ పనులను కూడా చేసుకోలేడు. ఈ పరిస్థితిలో వారికి మరొకరి సహాయం తప్పని సరిగా అవసరం అవుతుంది.

కోవిడ్ తర్వాత మరింత పెరిగిన కేసులు

కరోనా మహమ్మారి తర్వాత, అల్జీమర్స్ వ్యాధి కేసులు పెరిగాయి. కోవిడ్ నుండి కోలుకున్న చాలా మంది రోగులలో జ్ఞాపకశక్తి బలహీనత, కన్‌ఫ్యూజన్‌ వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కోవిడ్ కారణంగా అనేక రకాల నరాల సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. వీటిలో బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ఫాగ్‌, నిరంతర తల నొప్పి వంటి అనేక కేసులు వెలుగులోకొచ్చాయి. కరోనా వైరస్ మెదడుపై ప్రభావం చూపడం వల్లనే ఈ విధమైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న రోగుల్లో న్యూరో సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని డాక్టర్‌ వినీత్ పేర్కొన్నారు.