BCCL Recruitment 2022: నెలకు రూ. 2 లక్షల జీతంతో భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited) పరిధిలోని భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లో ఖాళీగా ఉన్న.. 41 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టు (Medical Specialist posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BCCL Recruitment 2022: నెలకు రూ. 2 లక్షల జీతంతో భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Coal India
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2022 | 9:55 AM

Coal India Limited-BCCL Medical Executive Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited) పరిధిలోని భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లో ఖాళీగా ఉన్న.. 41 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టు (Medical Specialist posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సర్జన్, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మోనాలజిస్ట్/ చెస్ట్‌ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్ స్పెషలైజేషన్‌లలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తా చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 29, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్హతలు/ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్ మెడికల్ స్పెషలిస్టు (E4)/ మెడికల్ స్పెషలిస్టు (E3) పోస్టులు: 28
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టులు: 13

అడ్రస్: The General Manager, (Personnel/EE), Bharat Coking Coal Limited at Executive Establishment, Koyla Bhawan, Post: Koyla Nagar, BCCL Township, Dist Dhanbad, Jharkhand- 826005.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!