AIIMS Recruitment 2022: ఎయిమ్స్‌ జోథ్‌పూర్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.168900ల జీతంతో రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోథ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Jodhpur).. 72 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

AIIMS Recruitment 2022: ఎయిమ్స్‌ జోథ్‌పూర్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.168900ల జీతంతో రాత పరీక్షలేకుండా ఎంపిక..
AIIMS Jodhpur Recruitment 2022
Follow us

|

Updated on: Sep 26, 2022 | 10:23 AM

AIIMS Jodhpur Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోథ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Jodhpur).. 72 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనెస్థీషియాలజీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, డెర్మాటాలజీ, డయాగ్నోస్టిక్‌ అండ్‌ ఇంటర్‌వెన్షనల్‌ రేడియాలజీ, ఈఎన్‌టీ, ఎండోక్రినాలజీ అండ్‌ మెటబాలిజం, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ అంకాలజీ, మైక్రోబయోలజీ, నెఫ్రాలజీ, పాతాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, సర్జికల్‌ అంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనిర్సిటీ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, ఎండీ/ఎంఎస్‌, డాక్టరేట్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసు 58 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ. 3000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.200లు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. పై పోస్టులన్నీ భర్తీ అయ్యేంత వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అంతే ప్రత్యేక తుది గడువు ఉండదన్న మాట. విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,68,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రొఫెసర్ పోస్టులు: 31
  • అదనపు ప్రొఫెసర్ పోస్టులు: 8
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 20
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 13

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.