Swathimuthyam Trailer: అందమైన ప్రేమ కథలోకి ఊహించని సమస్య.. ఆసక్తికరంగా స్వాతి ముత్యం ట్రైలర్‌..

Swathimuthyam Trailer: ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'....

Swathimuthyam Trailer: అందమైన ప్రేమ కథలోకి ఊహించని సమస్య.. ఆసక్తికరంగా స్వాతి ముత్యం ట్రైలర్‌..
Swathimuthyam
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2022 | 2:37 PM

Swathimuthyam Trailer: ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే సోమవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ వేడుకను హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు గణేష్, వర్ష బొల్లమ్మ, నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఇక 2.09 నిమిసాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ‘నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు’ అంటూ హీరోయిన్‌ సంభాషణలతో ట్రైలర్‌ ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌ ప్రేమల పడడం, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తారు. అయితే అనుకోకుండా వారికి ఓ సమస్య వస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి.? దాని నుంచి బయటపడేందుకు వారు ఏం చేశారన్న ఆసక్తికర అంశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. న్యాచురల్‌ డైలాగ్స్‌, సన్నివేశాలతో ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అలరిస్తోంది. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేలా సరదాగా ఉంది.

ఇవి కూడా చదవండి

ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ముందుగా నేను గణేష్ కి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టోరీ రాశాక నేను ముందు కలిసింది గణేష్ ని. ఈ కథ అంగీకరించినందుకు గణేష్ కి బిగ్ థాంక్స్. ఈ సినిమా రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కాదు. సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్ లో ఒకబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే ఫ్యామిలీ మెంబెర్స్ పెళ్లి చేసే విధానం, ఆ సిచ్యువేషన్ లో అబ్బాయికి వచ్చే ప్రాబ్లమ్ చూపించబోతున్నాం. చాలా విచిత్రంగా ఉంటుంది. అబ్బాయి లైఫ్ లో ఒక విచిత్రమైన ప్రాబ్లమ్ వస్తే, ఆ అబ్బాయి ఎలా ఫేస్ చేస్తాడు? ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? మన చుట్టూ ఉండేవారు ఆ ప్రాబ్లెమ్ కి ఎలా రియాక్ట్ అవుతారు? ఇలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గణేష్ కూడా చాలా బాగా చేశాడు’ అని చెప్పుకొచ్చాడు. మరి ట్రైలర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..