Tollywood Movies: దసరా పండగ వేళ మరింత వినోదం.. ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

ఇవే కాకుండా సినీ ప్రియులకు ఈ వారం మరింత సందడిగా మారనుంది. అటు థియేటర్లలో, ఓటీటీలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి.

Tollywood Movies: దసరా పండగ వేళ మరింత వినోదం.. ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Ponniyin Selvan Cobra
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2022 | 5:19 PM

పండగ వాతావరణం మొదలైంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండగ సంబరాలు ప్రారంభంకాగా.. మరోవైపు సోమవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు షూరు అయ్యాయి. మరోవైపు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవే కాకుండా సినీ ప్రియులకు ఈ వారం మరింత సందడిగా మారనుంది. అటు థియేటర్లలో, ఓటీటీలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన సినిమాలు మాత్రమే కాకుండా.. చిన్న చిత్రాలు, సస్పెన్స్ వెబ్ సిరీస్ కూడా రాబోతున్నాయి. మరీ ఈ వారం ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించనున్న సినిమాలు ఏవో తెలుసుకుందామా.

పొన్నియిన్ సెల్వన్. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తారగణంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది.

నేనే వస్తున్నా.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నేనే వస్తున్న. ఇందులో ఇలి అవ్రామ్, ఇందుజా కీలకపాత్రలలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. శ్రీరాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుంది.

విక్రమ్ వేద.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో రాధిక ఆప్టే నటిస్తుండగా..పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు.. సామ్ సి.ఎస్, విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓటీటీలో రాబోయే చిత్రాలు..

అమెజాన్ ప్రైమ్.. 777 చార్లీ.. సెప్టెంబర్ 30

డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. కర్మయుద్ద్.. సెప్టెంబర్ 30

సోనీ లివ్.. కోబ్రా.. సెప్టెంబర్ 28

జీ5.. బుల్లెట్ ట్రైన్.. సెప్టెంబర్ 29 కెప్టెన్.. సెప్టెంబర్ 30

నెట్ ప్లిక్స్.. బ్లోండీ.. సెప్టెంబర్ 28 ప్లాన్ ఏ ప్లాన్ బి.. సెప్టెంబర్ 30

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం