AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VV Vinayak: ఎన్టీఆర్‌తో అదుర్స్‌ 2 సాధ్యమవుతుందా.? వివి వినాయక్‌ సమాధానం ఏంటంటే..

VV Vinayak: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, వివి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అదుర్స్‌'. 2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చారి పాత్రలో కామెడీ, నర్సింహ పాత్రలో...

VV Vinayak: ఎన్టీఆర్‌తో అదుర్స్‌ 2 సాధ్యమవుతుందా.? వివి వినాయక్‌ సమాధానం ఏంటంటే..
Vv Vinayk About Adhurs 2
Narender Vaitla
|

Updated on: Sep 26, 2022 | 5:26 PM

Share

VV Vinayak: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, వివి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అదుర్స్‌’. 2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చారి పాత్రలో కామెడీ, నర్సింహ పాత్రలో యాక్షన్‌తో ఎన్టీఆర్‌ తన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేశాడు. కామెడీలోనూ తనకు సాటిలేరని చాటిచెప్పాడు. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎన్టీఆర్‌ల మధ్య సన్నివేశాలకు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వుకున్నారు. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా నయనతారతో పాటు షీలా నటించారు. కోన వెంకట్‌ కథ అందించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ సమకూర్చారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వివి వినాయక్‌ కూడా స్టోరీ సిద్ధం చేసుకున్నాడని చిత్రీకరణ కూడా ప్రారంభమవుతందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వినాయక్‌ ఇదే విషయమై స్పందించారు.

అదుర్స్‌ సీక్వెల్‌ సినిమా ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అదుర్స్‌ 2 అనేది అసలు సాధ్యపడదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఒకటి రెండు ఐడియాలు అనుకున్నాం కానీ.. కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. దీంతో నాకే నచ్చలేదు. నా కెరీర్‌లో, తారక్‌ కెరీర్‌లో అదుర్స్‌ అనేది ఒక మంచి సినిమా, దానిని అలా వదిలేయడమే మంచిది. ఈ రోజుకి కూడా ఆ సినిమాకి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది కాబట్టి దానిని పాడు చేసుకోకుండా అలా వదిలేయడమే బెటర్‌’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అదుర్స్‌2 సినిమాపై వచ్చిన, వస్తోన్న వార్తలకు చెక్‌ పడ్డట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..