AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Setu: ‘రామ్‌ సేతు’ను రక్షించేందుకు చేసే సాహస ప్రయాణం.. విజువల్‌ వండర్‌లా ఫస్ట్‌ గ్లింప్స్‌..

Ram Setu: పురాణ ఇతిహాస నేపథ్యంగా సినిమాలకు భారీగా ప్రేక్షకాధరణ లభిస్తోంది. తాజాగా ద్వారక నగరం నేపథ్యంలో వచ్చిన 'కార్తికేయ 2' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Ram Setu: 'రామ్‌ సేతు'ను రక్షించేందుకు చేసే సాహస ప్రయాణం.. విజువల్‌ వండర్‌లా ఫస్ట్‌ గ్లింప్స్‌..
Ram Setu First Glimpse
Narender Vaitla
|

Updated on: Sep 26, 2022 | 5:00 PM

Share

Ram Setu: ఇటీవల పురాణ ఇతిహాస నేపథ్యంగా వస్తోన్న సినిమాలకు భారీగా ప్రేక్షకాధరణ లభిస్తోంది. తాజాగా ద్వారక నగరం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ 2’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురాణ ఇతిహాసాన్ని ఈతరం ప్రేక్షకులకు ఎంతో విడమరిచి చెప్పిందీ సినిమా. ఈ క్రమంలోనే తాజాగా రామాయణాన్ని ఇతివృత్తంగా చేసుకొని మరో సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రామ్‌ సేతు’. ఈ సినిమాను హిందూ మహా సముద్రంలో ఉన్న రామ వారధి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నాడు. ఇక టాలీవుడ్‌ ట్యాలెంట్‌ యాక్టర్‌ సత్యదేవ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ‘రామ్‌సేతును కాపాడటానికి మన దగ్గర మూడురోజులే ఉన్నాయి’ అని అక్షయ్‌కుమార్‌ డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ముఖ్యంగా చేసింగ్‌ సీన్లు, ఫైరింగ్‌ సీన్స్‌ ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇందులో జాక్వైలీన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ భారుచ్చా కీలక పాత్రలో నటిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుస్తోన్న ఈ చిత్రాన్ని ఏయే భాషల్లో విడుదల చేస్తారన్న విషయంపై చిత్ర యూనిట్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. రామ సేతుకు ఎలాంటి ప్రమాదం ఏర్పడింది. దానిని అక్షయ్‌ కుమార్‌ బృందం ఎలా తప్పించిందన్న ఆసక్తికర కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?