AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ‘వారిపై రివేంజ్ తీర్చుకుంటాను.. నమ్మినవాళ్లే ఇలా చేశారు’.. ఎలిమినేషన్ పై నేహా షాకింగ్ కామెంట్స్..

ఇప్పటికీ ఆట మొదలు పెట్టనివారు ఇంట్లో చాలా మంది ఉన్నారని.. వారంతా కాకుండా గేమ్ ఆడుతున్న నేహా బయటకు రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాను ఎలిమినేట్ కావడంపై నేహా కూడా షాకయ్యింది. నమ్మినవాళ్లే ఇలా చేశారని.

Bigg Boss 6 Telugu: 'వారిపై రివేంజ్ తీర్చుకుంటాను.. నమ్మినవాళ్లే ఇలా చేశారు'.. ఎలిమినేషన్ పై నేహా షాకింగ్ కామెంట్స్..
Neha Chowdary
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2022 | 4:51 PM

Share

బిగ్ బాస్ 6 మూడు వారాలు విజయవంతంగా పూర్తైంది (Bigg Boss 6 Telugu). రెండో వారంలో అభినయ శ్రీ, షాని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మూడవ వారం అనుహ్యంగా నేహా చౌదరి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అయితే ముందు నుంచి వాసంతి ఎలిమినేట్ అవుతుందని భావించారు అంతా. ఇక ఆ తర్వాత ఇనయ ఎలిమినేట్ కాబోతుందంటూ వార్తలు వినిపించాయ. కానీ చివరి నిమిషంలో ఇనయ సేఫ్ కాగా.. నేహా ఎలిమినేట్ అయ్యింది. కానీ వాసంతి కంటే కాస్త గేమ్ ఎక్కువగా ఆడడం..అవసరమైన విషయాలలో వాదించడంలో నేహ ముందుండేది. గేమ్ సీరియస్‏గా ఆడుతున్న నేహా ఎలిమినేట్ కావడంపై నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆట మొదలు పెట్టనివారు ఇంట్లో చాలా మంది ఉన్నారని.. వారంతా కాకుండా గేమ్ ఆడుతున్న నేహా బయటకు రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాను ఎలిమినేట్ కావడంపై నేహా కూడా షాకయ్యింది. నమ్మినవాళ్లే ఇలా చేశారని.. ముఖ్యంగా రేవంత్ వల్లే తాను బయటకు వచ్చానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని… చాలా షాకింగ్‏గా అనిపిస్తుందని తెలిపింది. ఎలిమినేషన్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా తన అసహనాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ తాను ఎందుకు బయటకు వచ్చాననేది అర్థంకావడం లేదని.. తనకంటే గేమ్ ఆడని వాళ్లు కూడా చాలా మంది ఇంట్లో ఉన్నారని తెలిపింది. మరోసారి తనకు బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తానని.. అసలు రివేంజ్ తీసుకోవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపింది. అంతేకాకుండా ఫిజికల్ టాస్కుల్లో ఆమెకు తగిలిన దెబ్బలను సైతం చూపించింది. గేమ్ తర్వాత దెబ్బ ఎలా తగిలింది అని ఆలోచించేవాళ్లమని తెలిపింది. ఎన్ని దెబ్బలు తగిలినా తాను మాత్రంలో టాస్కులలో పోరాడనని.. బిగ్ బాస్ లో ఉన్న రోజులు మాత్రం మెమొరబుల్ గా ఉండిపోతాయంటూ వ్యాఖ్యనించింది.