Navika Kotia: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బుల్లితెర నటి.. గత మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్న నవికా కోటియా

తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నట్లు నవికా స్వయం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని.. అయితే వ్యాధి తీవ్రం కావడంతో..

Navika Kotia: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బుల్లితెర నటి.. గత మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్న నవికా కోటియా
Navika Kotia Hospitalized
Follow us
Surya Kala

|

Updated on: Sep 26, 2022 | 8:58 PM

Navika Kotia Hospitalized: ప్రముఖ హిందీ సూపర్ హిట్ సీరియల్ యే రిస్తా క్యా కెహ్లాతా హై సీరియల్  లో నటించినవారు భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సూపర్ హిట్ సీరియల్ తెలుగులో పెళ్లంటే నూరేళ్ల పంట గా డబ్ అయ్యిప్రసారం అయింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో అనేక మార్పులు చేర్పులతో కొన్ని సంవత్సరాలుగా బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సీరియల్ లో నటించిన ఖాన్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ సీరియల్‌తో మాయ పాత్రలో నటించి తనదైన ముద్ర వేసిన నవికా కోటియా ఆసుపత్రిలో చేరింది. నావిక గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నట్లు నవికా స్వయం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని.. అయితే వ్యాధి తీవ్రం కావడంతో.. ఇటీవలే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పేర్కొంది.

నావికా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రికి చెందినది. ఈ ఆస్పత్రిలో నవికా చేరింది. దీనితో పాటు.. ఆసుపత్రిలో తనను కలవడానికి వచ్చిన తన స్నేహితుడు పాలక్ సిధ్వాని ఫోటోను కూడా నావికా పంచుకుంది. తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా సీరియల్ లో సోను పాత్రలో పాలక్ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టా ద్వారా హెల్త్ అప్‌డేట్:

నావికా తన ఇన్‌స్టా లో తాను గత మూడు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నానని వెల్లడించింది. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా ఉన్న తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది.

అంతేకాదు తాను గత మూడు రోజులు అలసిపోయానని.. చాలా కష్టంగా ఉందని తెలిపింది. తన చుట్టూ చాలా మంది తనను ప్రేమించేవారున్నారని, తనకు కష్ట సమయంలో మద్దతుగా నిలిచే స్నేహితులను ఉన్నారని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులు ఎంతో సహనంగా కేరింగ్ గా ఉన్నారని అందుకనే వారందరికీ కృతఙ్ఞతలు తెలిపింది.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..