Katrina Kaif: విజయ్ దళపతి పాటకు కత్రినా కైఫ్ స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. పిల్లలతో కలిసి అందంగా డ్యాన్స్ చేసిన ముద్దుగుమ్మ..

ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఇదే వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ స్కూల్ పిల్లలతో తనకు కలిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

Katrina Kaif: విజయ్ దళపతి పాటకు కత్రినా కైఫ్ స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. పిల్లలతో కలిసి అందంగా డ్యాన్స్ చేసిన ముద్దుగుమ్మ..
Katina Kaif, Vijay Thalapat
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2022 | 8:58 PM

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రస్తుతం తన రాబోయే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులోని మధురైలోని మౌంటెన్ వ్యూ స్కూల్లో కాసేపు సందడి చేశారు. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కత్రీనా కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అంతేకాకుండా వారితో కలిసి విజయ్ దళపతి నటించిన బీస్ట్ చిత్రంలోని అరబిక్ కుతు పాటకు అందంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఇదే వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ స్కూల్ పిల్లలతో తనకు కలిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

” శనివారం మౌంటెన్ వ్యూ స్కూల్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్నాను. పిల్లలు చేసిన అద్భుతమైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆ సయయం చాలా ప్రత్యేకమైనది. అలాగే మేము మూడు కొత్త తరగతులను ప్రారంభించాము. ఈ గదలను నిర్మించేందుకు విరాళాలు ఇచ్చినవారికి ధన్యవాదాలు. ఈ పాఠశాలలో మా అమ్మ పని చేసినందుకు నేను గర్వపడుతున్నాను. మా సోదరుడు సెబాస్టీన్ అమ్మకు సాయం చేస్తూ సంవత్సరంపాటు ఇక్కడే ఉన్నాడు. ఇది నిజంగా అందమైన పాఠశాల ” అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

2015లో పేద విద్యార్థులకు ఆంగ్లం బోధించేందుకు ఈ మౌంటెన్ వ్యూ స్కూల్ రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా ప్రారంభమైంది. ఈ పాఠశాల ప్రారంభం నుంచి కొన్నేళ్లపాటు కత్రినా తల్లి సుజానే ఇందులో పాఠాలు చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కత్రినా చేతిలో భూత్, టైగర్ 3, మెర్రీ క్రిస్మస్ చిత్రాలున్నాయి.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.