Sharukh Khan: సుప్రీంకోర్టులో షారుఖ్ ఖాన్కు ఊరట.. సెలబ్రెటీలకు సమాన హక్కులుంటాయని తీర్పు..
కేవలం సెలబ్రెటీ అయినంత మాత్రం అతను అందరినీ ఎలా నియంత్రించగలడని ప్రశ్నించింది. అనవసరమైన విషయాలపై విచారణ జరపడం వలన కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కోంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్కు (Sharukh Khan) సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. సెలబ్రెటీలందరికీ ఇతర పౌరుల మాదిరిగానే హక్కులు ఉంటాయని.. వారిని దోషులుగా పరిగణించలేమని సోమవారం వ్యాఖ్యనించింది. 2017లో వడోదర రైల్వే స్టేషన్లో తాను నటించిన రయీస్ సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. అందులో గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించారు. దీంతో ఈ ప్రమాదానికి కారణం షారుఖ్ అని అతని పేరు మీద కేసు నమోదైంది.
ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో షారుఖ్ తప్పు లేదని.. కేవలం అతను సెలబ్రెటీ అయినందున అతడిని దోషిగా పరగణించలేమని తెలిపింది. జస్టిస్ అజయ్ రస్తోగి, సిటి రవి కుమార్లతో కూడి ధర్మాసనం ఏప్రిల్లో షారుఖ్ పై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేస్తున్నట్లు పేర్కోంది. సెలబ్రెటీలు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి భద్రతకు సిబ్బంది హామీ ఇస్తారని లేదా వ్యక్తిగత హామీ ఇస్తారని భావించలేమని కోర్టు తెలిపింది. ప్రతి పౌరుల మాదిరిగానే సెలబ్రెటీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని తెలిపింది. కేవలం సెలబ్రెటీ అయినంత మాత్రం అతను అందరినీ ఎలా నియంత్రించగలడని ప్రశ్నించింది. అనవసరమైన విషయాలపై విచారణ జరపడం వలన కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.