AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha- Reyaki Veye Kallu: తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో తమిళ్ బ్లాక్ బస్టర్.. ఆహాలో ‘రేయికి వేయి కళ్లు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి రేయికి వేయి కళ్లు’ (Reyaki Veye Kallu) తీసుకొస్తున్నారు. ఈ సినిమా

Aha- Reyaki Veye Kallu: తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో తమిళ్ బ్లాక్ బస్టర్.. ఆహాలో 'రేయికి వేయి కళ్లు' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Reyaki Veye Kanulu Film
Rajitha Chanti
|

Updated on: Sep 27, 2022 | 12:46 PM

Share

ప్రస్తుతం థియేటర్లకు పోటీగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లలో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నా.. ఓటీటీ ఆదరణ మాత్రం తగ్గడం లేదు. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా..అటు థియేటర్లలో హిట్ చిత్రాలను మిస్ అయినవారు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాంలో సక్సెస్‏పుల్‏గా దూసుకుపోతున్న ఓటీటీలలో ఆహా ఒకటి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుగులోకి డబ్ చేసి మరీ సినీ ప్రియులకు ముందుకు తీసుకువస్తుంది ఆహా. తాజాగా మరో తమిళ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసుకురాబోతుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి రేయికి వేయి కళ్లు’ (Reyaki Veye Kallu) తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఆహాలో సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు తమిళ్ హీరో అరుళ్‌నిధి స్టాలిన్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రేయికి వేయి కళ్లు అనే సినిమాతో ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షుకులు, విమర్శకులు అందరూ కూడా సినిమాలోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ సినిమాను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో సినిమా గుర్తుకు వస్తుంటుంది. డైరెక్టర్ ము. మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

‘రేయికి వేయి కళ్లు’ కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్‌ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అంచనా వేయలేరు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ