Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ .. ఆదిపురుష్ టీజర్ పై ఓంరౌత్ ఏమన్నాడంటే..

కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోడవంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా టీజర్ అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ .. ఆదిపురుష్ టీజర్ పై ఓంరౌత్ ఏమన్నాడంటే..
Adipurush Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2022 | 1:12 PM

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ (Adipurush ) ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోడవంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా టీజర్ అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా అదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చారు డైరెక్టర్ ఓంరౌత్.

” మీ మ్యాజికల్ ప్రయాణం ఇప్పుడు మీ అనుభవం, మీ ప్రేమ. మీరంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్.. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‏లోని అయోధ్యలో బ్యాంక్ ఆఫ్ సరయు వేదిక వద్ద రిలీజ్ చేయనున్నాము. అలాగే ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి 12న ఐమ్యాక్స్, 3డీలో విడుదల అవుతుంది.” అంటూ ట్వీ్ట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఆదిపురుష్ టీజర్ లాంచ్ వేడుకకు ప్రభాస్, కృతి సనన్ హజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.