AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ సినిమాకోసం గురూజీ అనుకుంటున్న టైటిల్ ఇదేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మహేష్.

Mahesh Babu: మహేష్ సినిమాకోసం గురూజీ అనుకుంటున్న టైటిల్ ఇదేనా..?
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2022 | 3:06 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మహేష్. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ తో పాటు అదిరిపోయే యాటిట్యూడ్ తో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా‌ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అందరికి తెలిసిందే..

ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను గురూజీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షడ్యూల్ కూడా కంప్లీట్ చేసేశారు. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్లో కంప్లీట్ చేశారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో మహేష్, పూజ కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజ హెగ్డే అరవింద సమేత, అల వైకుంటరపురంలో సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ఇదే నంటూ సోషల్ మీడియాలో రోజుకొక  వార్త చక్కర్లు కొడుతోంది . తన సినిమా టైటిల్ విషయంలో గురూజీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

టైటిల్ లో మొదటి అక్షరం ‘అ’ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు గురూజీ.. ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అలంటి టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటింస్తుందని తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. అలాగే ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ