SalmanKhan: బిగ్‌బాస్‌లో సల్లూ బాయ్ ఎంట్రీ.. గబ్బర్‌ సింగ్‌ స్టైల్‌లో అదుర్స్‌ అనిపించిన కండల వీరుడు

Bigg Boss 16 Hindi: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో బిగ్‌బాస్‌. బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న ఈ రియాల్టీ షో ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

SalmanKhan: బిగ్‌బాస్‌లో సల్లూ బాయ్ ఎంట్రీ.. గబ్బర్‌ సింగ్‌ స్టైల్‌లో అదుర్స్‌ అనిపించిన కండల వీరుడు
Salmankhan
Follow us
Basha Shek

|

Updated on: Sep 27, 2022 | 9:52 PM

Bigg Boss 16 Hindi: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో బిగ్‌బాస్‌. బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న ఈ రియాల్టీ షో ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి 16 సీజన్‌ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో కంటెస్టెంట్లు ఎవరెవరు రానున్నారు? ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ థీమ్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా విడుదల చేసింది బిగ్‌బాస్‌ యాజమాన్యం. అలాగే హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ ఫొటోలను కూడా రిలీజ్‌ చేసింది. ఇందులో స్టైలిష్‌ దుస్తులతో తళుక్కుమన్నాడు సల్మాన్‌. అలాగే క్యాట్రిడ్జ్‌లతో నిండిన బెల్ట్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా బిగ్‌బాస్‌లో సల్మాన్‌ లుక్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగ్‌ను పోలి ఉందని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా బిగ్‌బాస్‌ షో మొదలయిన కొత్తలో అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరించారు. కానీ మూడు సీజన్ల తర్వాత సల్మాన్ ఖాన్ దీనిని హోస్ట్ చేయడం ప్రారంభించాడు. సల్మాన్ ఆధ్వర్యంలో ఇప్పటికి 13 సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక ఈ సీజన్‌ను హోస్ట్ చేయడానికి సల్మాన్ రూ.1050 కోట్లు తీసుకున్నాడని బాలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. కాగా బిగ్ బాస్ 15వ సీజన్ కోసం సల్మాన్ రూ.350 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..