AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సినిమా రేంజ్‌లో బైక్‌ చోరీకి యత్నం.. హీరోలా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే

Delhi: ఇద్దరు దొంగలు సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా బైక్‌ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఇంతలో గేట్‌ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ సమయస్ఫూర్తితో వారికి ఊహించని షాక్‌ ఇచ్చాడు. దీంతో దొంగలు తక్షణమే అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

Viral Video: సినిమా రేంజ్‌లో బైక్‌ చోరీకి యత్నం.. హీరోలా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే
Bike Thieves
Basha Shek
|

Updated on: Sep 27, 2022 | 9:54 PM

Share

Delhi: ఈరోజుల్లో దొంగల ఆగడాలు ఎంతగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవకాశం దొరికితే మన కళ్లుగప్పి చిటికెలో చోరీలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనల్లో కొన్ని సార్లు దొంగలు దొరకుతారు.. మరికొన్నిసార్లు మన కళ్లల్లో మట్టి కొట్టి పారిపోతారు. ఇక చోరీ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు దొంగలు సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా బైక్‌ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఇంతలో గేట్‌ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ సమయస్ఫూర్తితో వారికి ఊహించని షాక్‌ ఇచ్చాడు. దీంతో దొంగలు తక్షణమే అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. సౌత్‌ఢిల్లీలోని ఎవరెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లోకి మున్సిపల్‌ అధికారులమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. వారి కదలికలు మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉండడంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్‌ వారిపై ఓ కన్నేసి ఉంచాడు. ఇదే సమయంలో అపార్ట్‌మెంట్‌లోపలికి బైక్‌పై ఓడెలివరీ బాయ్‌ వచ్చాడు. అతను త‌న బైక్ తాళాల‌ను ఆ వాహ‌నానికే ఉంచి వెళ్లాడు. ఇది గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు బైక్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. బైక్‌ను స్టార్ట్‌ చేయడం ప్రారంభించగానే డెలివరీ బాయ్‌ గట్టిగా కేకలు వేశాడు. ఇది విన్న సెక్యూరిటీ గార్డ్‌ వెంటనే అలెర్ట్‌ అయ్యాడు. వేగంగా దూసుకొస్తున్న బైక్‌ణు అడ్డుకునేందుకు గేటు మూసివేశాడు. దీంతో ఆ బైక్‌ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. దొంగలు కూడా గేటు వద్దే పారిపోయారు. ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరిలో ఒకరు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మరొకరిని పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెక్యూరిటీ గార్డ్‌ చేసిన పనిని అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..