Viral Video: మెట్రోలో సిక్కు యువకుడి స్టంట్ అదుర్స్.. ఎయిర్‌వాక్‌ చూసి నెటిజన్లు ఫిదా..

ఢిల్లీ మెట్రో లోపల యువకుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో బయటపడింది. అందులో ఒక యువకుడు మెట్రో కోచ్ లోపల స్తంభాన్ని పట్టుకుని చిత్రీకరించాడు. ఢిల్లీ మెట్రోలో మేకింగ్ వీడియోలు నిషేధించబడినప్పటికీ,..

Viral Video: మెట్రోలో సిక్కు యువకుడి స్టంట్ అదుర్స్.. ఎయిర్‌వాక్‌ చూసి నెటిజన్లు ఫిదా..
Airwalk
Follow us

|

Updated on: Sep 27, 2022 | 8:20 PM

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియో రీల్స్ సృష్టించడం ట్రెండ్‌గా మారింది. ప్రజలు ట్రెండ్‌కి తగ్గట్టుగా వివిధ సోషల్ మీడియా ఛాలెంజ్‌లు చేస్తూ తమ వీడియోలను రికార్డ్ చేయడం ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో విచిత్రంగా వీడియోలు చేస్తూ లైక్‌ల కోసం ఎగబడుతుంటారు చాలా మంది..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. రీల్స్‌, షార్ట్స్‌ వంటి వీడియోలు రికార్డ్‌ చేసి నెట్టింట్లో అప్‌లోడ్‌ చేయడం జనాలకు కామన్‌ అయిపోయింది.

ఇలాంటి రిల్స్‌, ఇంటర్‌నెట్‌లో ఫేమస్‌ కావటం కోసం కొందరు పబ్లిక్ ప్లేసులో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌ మెట్రోలో ఓ యువతి డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఢిల్లీ మెట్రోలోనూ అదే సీన్‌ కనిపించింది. ఢిల్లీ మెట్రోలో ఓ బాలిక చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో చేరి హల్‌చల్‌ చేసింది. వీడియోలో ఆ చిన్నారి మెట్రో లోపల డ్యాన్స్‌ చేస్తుండటం కనిపించింది. ఇక ఇలాంటిదే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో లోపల యువకుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో బయటపడింది. అందులో ఒక యువకుడు మెట్రో కోచ్ లోపల స్తంభాన్ని పట్టుకుని చిత్రీకరించాడు. ఢిల్లీ మెట్రోలో మేకింగ్ వీడియోలు నిషేధించబడినప్పటికీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఒక యువకుడు ‘రివర్స్ ఎయిర్‌వాక్’ చేస్తున్నట్లు చూడవచ్చు. నిజానికి ఈ వీడియోను సిమ్రంజిత్ సింగ్ అనే కుర్రాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఈసారి అతను తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ‘ఎయిర్‌వాక్’ చేస్తున్నాడు. వీడియోల అతడు ఢిల్లీ మెట్రో లోపల కోచ్‌లో స్తంభం పట్టుకుని ఏదో మ్యాజిక్‌ చేస్తున్నట్టుగా గాల్లో అడుగులు వేస్తూ..అడ్డంగా పైకి ఎక్కుతున్నాడు.. రివర్స్ మోడ్ లో వీడియో పోస్ట్ చేశాడు. నలుపు రంగు టీషర్ట్‌, కుంకుమపువ్వు తలపాగా ధరించిన ఆ యువకుడి వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోని చాలా మంది లైక్ చేసారు. చాలా మంది ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. అయితే ఢిల్లీ మెట్రోలో ఇదంతా చేయడంపై నిషేధం ఉందని బహుశా ఈ కుర్రాడికి తెలియదేమో. సిమ్రంజిత్ సింగ్ అనే ఈ యువకుడి ప్రొఫైల్ చూసిన ఈ కుర్రాడు ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, ఎన్నో కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుర్రాడు ఈ వీడియో ద్వారా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాడు. కాగా, ఢిల్లీ మెట్రోలో పలువురు యువకులు విన్యాసాలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఇక్కడ ఓ కుర్రాడు రకరకాల కసరత్తులు చేస్తూ పోస్ట్ చేశాడు. బహుశా అందుకే ఈ వీడియోని లక్షలాది మంది లైక్ చేసారు. దానికి ప్రతిస్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి