Resort Murder Case: అమ్మాయిలను తీసుకొచ్చేవారు.. వీఐపీలు కూడా వచ్చేవారు..!!రిసెప్షనిస్ట్  హత్యకేసులో షాకింగ్ నిజాలు..

ఈ క్రమంలోనే మీరట్‌కు చెందిన ఓ మహిళ చెప్పిన వివరాలను పోలీసులు వెల్లడించారు..ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు. ఆధారాలు సేకరించామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు కూడా పోలీసులకు అందింది.

Resort Murder Case: అమ్మాయిలను తీసుకొచ్చేవారు.. వీఐపీలు కూడా వచ్చేవారు..!!రిసెప్షనిస్ట్  హత్యకేసులో షాకింగ్ నిజాలు..
Resort Murder Case
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 27, 2022 | 6:54 PM

ఉత్తరాఖండ్ రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. వనంతరా రిసార్ట్‌లో పనిచేస్తున్న మీరట్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పింది. అంకిత్ గుప్తా (నిందితుడు), పుల్కిత్ ఆర్య (ప్రధాన నిందితుడు) చర్యల కారణంగా తాను రెండు నెలలు మాత్రమే రిసార్ట్‌లో పని చేశానంటూ మహిళ చెప్పింది. ఈ కేసులో పోలీసులు ఇప్పుడు వనంతరా రిసార్ట్‌లో పనిచేసే మహిళలతో మాట్లాడి దర్యాప్తును ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే మీరట్‌కు చెందిన ఓ మహిళ చెప్పిన వివరాలను పోలీసులు వెల్లడించారు..మీరట్‌కు చెందిన ఓ మహిళ రెండు నెలలుగా రిషికేశ్‌లోని వనంతరా రిసార్ట్‌లో పనిచేస్తోంది. మహిళ మాట్లాడుతూ,.. తాను మే నెలలో రిషికేశ్‌లోని వనంతరా రిసార్ట్‌లో పనిలో చేరింది. కానీ జూలైలో అక్కడ నుండి వెళ్లిపోయానని చెప్పింది. అంకిత్ గుప్తా (నిందితుడు), పుల్కిత్ ఆర్య (ప్రధాన నిందితుడు) అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. వారు అమ్మాయిలను, వీఐపీలను కూడా అక్కడికి తీసుకువెళ్లేవారని చెప్పింది.

ఈ మేరకు..అంకితా భండారీ హత్యకేసులో ఏర్పాటైన సిట్‌ డిఐజి, ఇన్‌చార్జి పి.రేణుకాదేవి మాట్లాడుతూ.. నిందితుడి రిమాండ్‌కు ఒకటి రెండు రోజుల్లో పోలీసులు దరఖాస్తు చేయనున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలను వినియోగించగా ఆ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు. ఆధారాలు సేకరించామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు కూడా పోలీసులకు అందింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. ఆ రిసార్ట్‌లో గతంలో పనిచేసిన కొందరు మహిళల స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయనున్నారు.

ఇదిలా ఉంటే, పోలీసుల విచారణలో మృతురాలి మొబైల్‌ వాట్సప్‌ చాట్‌ ఆధారంగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ చాట్‌లో.. గెస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించవల్సిందిగా వనతారా రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్య తనను ఫోర్స్‌ చేస్తున్నట్లు అంకిత తన స్నేహితుడికి తెల్పింది. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. రాత్రి 8 గంటల 30 నిముషాల తర్వాత ఆమెకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కలవలేదని, తర్వాత పులకిత్‌ ఆర్యకు ఫోన్‌ చేస్తే.. ఆమె తన గదికి వెళ్లిపోయినట్లు అతడు సమాధానమిచ్చాడు. తర్వాత రోజు అతనికి మళ్లీ ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చినట్లు అంకిత స్నేహితుడు తెలిపాడు. దీంతో అతను రిసార్టు యజమాని సోదరుడు అంకిత్‌ ఆర్యకు ఫోన్‌ చేస్తే.. ఆమె జిమ్‌లో ఉన్నట్లు బదులిచ్చాడని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం తప్పిపోయిన 19 ఏళ్ల అంకితా భండారీ మృతదేహాన్ని శనివారం రిషికేశ్‌లోని చిల్లా కాలువలో గుర్తించారు పోలీసులు. ఆమె మరణానికి దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రిసార్ట్‌లో గెస్ట్‌లకు స్పెషల్ సర్వీస్ చేయాలని ఆమెను బలవంతం చేసినట్టు తెలిసింది. హోటల్ యజమాని, బీజేపీ నాయకుడి కుమారుడు, మరో ఇద్దరు కలసి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇప్పటికే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే