Viral Video: మరీ ఇంత నిర్లక్ష్యమా..! చిన్నారిని ఈడ్చుకెళ్లిన స్కూల్‌ బస్సు.. వీడియో చూసిన భయపడుతున్న నెటిజన్లు..

చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. అదృష్టం బాగుంది.. బస్సు డ్రైవర్‌ను విధుల్లోంచి తొలగించారు..

Viral Video: మరీ ఇంత నిర్లక్ష్యమా..! చిన్నారిని ఈడ్చుకెళ్లిన స్కూల్‌ బస్సు.. వీడియో చూసిన భయపడుతున్న నెటిజన్లు..
School Bus
Follow us

|

Updated on: Sep 27, 2022 | 5:48 PM

ప్రస్తుతం ఎంతో భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్కూల్‌ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ఎంతకష్టాన్ని అనుభవించిందో చూస్తే భయంవేస్తుంది. బస్సు దిగుతుండగా బాలిక బ్యాగ్ అనుకోకుండా బస్సు డోర్‌లో ఇరుక్కుపోయింది. అది బస్సు డ్రైవర్ గమనించలేదు. చూడకుండా స్కూల్‌ బస్సును వేగంగా స్టార్ట్‌ చేసి ముందుకు బయల్దేరాడు. చిన్నారి ప్రమాదకరంగా బస్సుకు వేలాడుతుందని డ్రైవర్ తెలుసుకునే సమయానికి..ఆ చిన్నారి కొన్ని మీటర్ల దూరం వరకు బస్సు వెంట ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలిక అద్భుతంగా బయటపడింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది. అయితే ఈ కేసు 2015 నాటిదిగా తెలిసింది. దీని వీడియో మళ్లీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో పింక్‌ కలర్‌ స్కూల్‌ బ్యాగ్‌ వేసుకుని ఉన్న చిన్నారి బస్సు దిగుతుండగా అమ్మాయి బ్యాగ్ తలుపుల మధ్యలో ఇరుక్కుపోయిన సీన్‌ కనిపించింది. అయితే, ఇది బస్సు డ్రైవర్ దృష్టికి రాకపోవడంతో ఆ లేడీ డ్రైవర్‌ బస్సు నడుపుతూనే ఉంది. ఈ ఘటన మొత్తం బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

బస్సు పాటుగానే చిన్నారి కూడా కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాలిక తృటిలో ప్రాణపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ ఘటన తర్వాత డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోను డీన్ బ్లండెల్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 63 లక్షల వ్యూస్‌ వచ్చాయి.. చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. అదృష్టం బాగుంది.. బస్సు డ్రైవర్‌ను తొలగించారు.. అనే క్యాప్షన్‌లో వినియోగదారు వీడియోని షేర్‌ చేశారు.

ఈ ఫుటేజీ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఈ వీడియోను ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలు మాత్రం డ్రైవర్ అలా ఎలా గమనించలేదని మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!