Viral Video: ఈ వీడియోను చూసి ఇతడిలా మాత్రం అస్సలు ట్రై చేయకండి.. హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లపై వేలాడుతూ..

కరెంట్‌ వైర్లు పట్టుకుని అతడు బ్యాలెన్స్ చేస్తూ కనిపించిన దృశ్యాలు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. హై ఓల్టెజ్‌ వైర్లను పట్టుకుని వేలాడుతున్న అతన్ని చూసిన స్థానికులు భయంతో హడలెత్తిపోయారు.

Viral Video: ఈ వీడియోను చూసి ఇతడిలా మాత్రం అస్సలు ట్రై చేయకండి.. హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లపై వేలాడుతూ..
Dangerous Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 27, 2022 | 3:16 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయ. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకంగా ఉంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. విచ్చలవిడి ఇంటర్ నెట్ సదుపాయం అందుబాటులోకి రావటం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్  త్తంగా చెప్పాలంటే, సోషల్‌ మీడియా ప్రపంచం అనేక చిత్ర విచిత్రాలతో నిండిపోయి ఉంటుంది. ఇంటర్‌నెట్‌ వేదికగా చాలా మంది యువకులు రాత్రికి రాత్రే ఫేమస్‌ అవ్వలని ఆశపడుతుంటారు. ఇంకొందరు యువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హై రిస్క్‌ పనులు చేస్తుంటారు. భయంకరంగా బైక్‌లతో విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు స్పీడ్‌గా వెళ్తున్న రైలులోంచి దూకుతూ, రైలుకు పక్కగా నడుస్తూ రీల్స్‌ చేస్తుంటారు. ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టెల్లా చేస్తుంటారు. అలాంటిదే ఇక్కడ మరో సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలోని అమారియా పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. రద్దీ ప్రదేశంలోని హై వోల్టేజీ వైర్లపై స్వింగ్ చేస్తున్నాడు. కరెంట్‌ వైర్లు పట్టుకుని అతడు బ్యాలెన్స్ చేస్తూ కనిపించిన దృశ్యాలు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. హై ఓల్టెజ్‌ వైర్లను పట్టుకుని వేలాడుతున్న అతన్ని చూసిన స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందోనని టెన్షన్‌పడ్డారు. స్థానికులంతా అరుపులు, కేకలు వేస్తూ అక్కడ జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అందరూ చూస్తుండగానే అతడు వైర్లకు వేలాడుతూ.. విన్యాసాలు చేయసాగాడు. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఇప్పుడు ఆ వీడియో కాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. పైగా అక్కడ యువకుడు వేలాడుతున్న విద్యుత్ లైన్లు 11 కెవి హై-టెన్షన్ యూనిట్‌గా తెలిసింది.

ఇవి కూడా చదవండి

అయితే, పిలిభిత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసింది. దీంతో యువకుడు వైర్లుపట్టుకుని వేలాడిన క్రమంలో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో విద్యుత్‌ లైన్‌కు వ్యక్తి వేలాడుతూ ఉండడంతో స్థానికులు విద్యుత్‌ శాఖాధికారులను అప్రమత్తం చేశారు. దాంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను మరింత ఆలస్యంగా ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కిందికి దింపారు. ఆ వ్యక్తిని నౌషాద్‌గా గుర్తించారు. అతను మార్కెట్ ప్రాంతంలో తన బండిలో గాజులు విక్రయిస్తున్నాడు.

ముఖ్యంగా, ఇటువంటి విన్యాసాలు ప్రమాదకరమైనవి. తీవ్రమైన ప్రమాదాలకు కారణం కావచ్చు. వైరల్‌గా మారే ప్రయత్నంలో చాలా మంది అలాంటి విన్యాసాలు చేసి ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి