Road Accident: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గుడికి వెళ్తుండగా ప్రమాదం.. ట్రాక్టర్ చెరువులో పడి 10 మంది మృతి..
నవరాత్రి ఉత్సవాల తొలిరోజు చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు ఓ కుటుంబం ట్రాక్టర్‌లో ఆలయానికి బయలుదేరింది. ట్రాక్టర్‌లో చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కలిపి మొత్తం 47 మంది ఉన్నారు.
Road Accident: దసరా శరన్నవరాత్రుల తొలి రోజునే అక్కడ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి సమీపంలోని చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించినట్టుగా తెలిసింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో.. 10 మంది మృతిచెందారు. బాధితులను సీతాపూర్‌లోని అట్టారియా నివాసితులుగా గుర్తించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజు చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు అట్టారియాకు చెందిన ఓ కుటుంబం ఉన్నై దేవి ఆలయానికి ట్రాక్టర్‌లో బయలుదేరింది. ట్రాక్టర్‌లో చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కలిపి మొత్తం 47 మంది ఉన్నారు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ (లక్నో) సూర్య పాల్ గంగ్వార్ వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా సూర్య పాల్ గంగ్వార్ తెలిపారు.ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Uttar Pradesh | A tractor’s trolley got disbalanced and overturned in a pond in Itaunja. They were going to a temple. SDRF team rushed to the spot. 37 people rescued and are healthy. 10 people were declared dead at the hospital: Laxmi Singh, IG Lucknow Range pic.twitter.com/ZJFQZ4smhk
ఇవి కూడా చదవండి— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 26, 2022
తీవ్ర గాయాలతో బయటపడ్డ వారిలో ఒకరిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. మరికొందరు ఇటౌంజాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ లక్నో శివార్లలోని ఇటౌంజా ప్రాంతంలో.. ప్రధాన రహదారిపై నుంచి జారి చెరువులో పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. చెరువు దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం చెరవేశారు. మొత్తంగా 37 మందిని రక్షించారు.
#UPCM @myogiadityanath ने राजधानी लखनऊ में एक ट्रैक्टर ट्रॉली के तालाब में पलटने से हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है।
मुख्यमंत्री जी ने दिवंगतों की आत्मा की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) September 26, 2022
కాగా, జరిగిన ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందినవారిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి