AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడైనా ఉండాలి.. క్లాస్ రూంలో తన స్నేహితురాలికి అబ్బాయి చేసిన సాయం తెలిస్తే షాకవుతారు..

ఎక్కువగా వైరల్‌గా మారే వీడియోల్లో ఫన్నీ వీడియోలు కూడా అనేకం ఉంటాయి. ఫన్నీ వీడియోలను ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆపుకోవడం మాత్రమే కష్టంగా ఉంటుంది. అలాంటిదే..

Viral Video: ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడైనా ఉండాలి.. క్లాస్ రూంలో తన స్నేహితురాలికి అబ్బాయి చేసిన సాయం తెలిస్తే షాకవుతారు..
Boyfriend Searching Lice
Jyothi Gadda
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 30, 2022 | 3:14 PM

Share

Viral Video: ఇంటర్నెట్‌లో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు చాలా వరకు వైరల్‌ అవుతుంటాయి. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా చేస్తాయి. కొన్ని సందర్బాల్లో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే..ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎక్కువగా వైరల్‌గా మారే వీడియోల్లో ఫన్నీ వీడియోలు కూడా అనేకం ఉంటాయి. ఫన్నీ వీడియోలను ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆపుకోవడం మాత్రమే కష్టంగా ఉంటుంది. అలాంటి వీడియోలను చూసినప్పుడు మనం దాని గురించి నిజంగా ఆలోచిస్తాము. అలాంటిదే ఈ వీడియో కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో క్లాస్‌ రూమ్‌కు సంబంధించినది..క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉన్నట్టుగా ఉంది..ఈ గ్యాప్‌లో క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులు చేస్తున్న ఈ వింతపని అందరినీ తెగ నవ్విస్తుంది. అది తెలిస్తే మీరు కూడా పగలబడి నవ్వుకుంటారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో క్లాస్‌లో కూర్చున్న ఓ అబ్బాయి, తన గర్ల్‌ఫ్రెండ్‌ని చూడొచ్చు. వారి వెనుక మరో అమ్మాయి కూర్చోవడం కనిపిస్తుంది. చూస్తుంటే ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ ఒడిలో తల వెంట్రుకలు విప్పి కూర్చుని కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ విద్యార్థిపై అతడు చూపించే ప్రేమానురాగం మామూలుగా లేదు. ఇది మాటల్లో చెప్పెకంటే.. వీడియోలో చూస్తేనే బాగుంటుంది. మీరు వీడియో చూస్తే షాక్ అవుతారు. అంటే క్లాసులో కూర్చొని గర్ల్‌ఫ్రెండ్‌ తలలో పేలు చూస్తున్నాడు ఆ అబ్బాయి. ఈ దృశ్యాన్ని ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. వీడియో చూశారంటే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు.

ఇవి కూడా చదవండి

వెనుక బెంచ్‌లో కూర్చున్న అమ్మాయి కూడా తన బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ చేసే చర్యలకు ఆశ్చర్యపోవడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 18plusguyy షేర్ చేసింది. దీనికి అనేక కామెంట్లు, వ్యూస్‌, లైకులు వచ్చాయి. ఈ వీడియోకి ఇప్పటి వరకు 32.4k వ్యూస్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి