Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: దశాబ్దకాలంగా కుడి చేతిని పైకి ఎత్తి ఉంచిన సాధువు.. అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం..!

గతంలో వార్తల్లోకెక్కిన అమర్‌ భారతి మొదట సన్యాసి కాదు..ఓ బ్యాంక్ ఉద్యోగి. అందరిలాగే ఉద్యోగం చేసుకుంటూ భార్య, పిల్లలతో ఉండేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు..

Viral News: దశాబ్దకాలంగా కుడి చేతిని పైకి ఎత్తి ఉంచిన సాధువు.. అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం..!
Sadhu
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2022 | 5:35 PM

Viral News:  బాహుబలి సినిమా అందరికీ బాగా గుర్తుండిపోయిన సినిమా…ఎందుకంటే.. ఆ సినిమా భారీ బడ్జెట్‌ మూవీయే కాదు.. భారీ ప్రేక్షకాదరణ పొందిన చిత్రం కూడా.. అయితే, అందులో రమ్యక్రిష్ణ పాత్ర కూడా అత్యంత కీలకం.. అందులో శివగామి పేరుతో నటించిన రమ్యక్రిష్ణ..తన మనవడిని కాపాడుకునే సీన్‌..అద్భుతంగా ఉంటుంది. పసిపిల్లవాడిని వరద ప్రవాహం నుండి కాపాడేందుకు ఆమె తన చేతిలోని బాబును అలాగే పైకి ఎత్తి పట్టుకుని ఉంటుంది. అలా చివరకు తను ప్రాణత్యాగం చేసి హీరోని రక్షిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా మీ సందేహం..సినిమాలో శివగామి అలా తన చేతిని పైకి ఎత్తిపెట్టి ఉండటం..ఎలా సాధ్యమైంది అనే విషయానికి వస్తే..అది సినిమా కాబట్టి సాధ్యమైంది.. కానీ, మామూలుగా అయితే, ఎవరైన చేయి పైకెత్తి పట్టుకుని ఉండటం అసాధ్యమనే చెప్పాలి..అలా ఉండాలంటే మహా అయితే పది నిమిషాలో 20 నిమిషాలో ఉంటారు. లేదు..కొంచెం కండపుష్టి, శరీర శక్తి ఉంటే అర గంట వరకు ఎత్తిన చేయి దించకుండా అలానే ఉండగలరేమో. కానీ, ఏళ్ల తరబడి అలాగే ఎత్తిన చేయి దించకుండా ఎవరైనా ఉండగలరా..? వామ్మో ఏండ్ల తరబడి చేయి ఎత్తి ఉండటమా..? అది అసాధ్యమే..! అనుకుంటున్నారు కదా.. కానీ, ఆ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు ఓ సాధువు. దాదాపు 10 ఏళ్లుగా ఎత్తిన చేయి దించకుండా అలానే ఉండిపోయాడు. ఇంతకీ ఎవరా సాధువు..? అసలు ఈ విషయం నిజమేనా..అనే విషయాలుఉ ఇక్కడ తెలసుకుందాం..

70 ఏళ్ల సాధువు అమర్‌ భారతి.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకి ఎత్తి ఉంచినట్లు అప్పట్లో వార్తలు, వీడియోలు హల్‌చల్‌ చేశాయి. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్‌ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేడని వైద్య నిపుణులు చెప్పిన మాట. అయితే, అలాంటి సాధువు మరోకరు కొత్తగా తెరమీదకు వచ్చారు. అమర్‌ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేయలేకలేదు. కానీ, అలాంటి సహాసమే చేశారు. గత 10 ఏళ్లుగా ఈ సాధువు కూడా తన చేతిని పైకి ఎత్తే ఉంచానని చెప్పారు. ప్రస్తుతం ఈ అజ్ఞాత సన్యాసి ఫోటోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గతంలో వార్తల్లోకెక్కిన అమర్‌ భారతి మొదట సన్యాసి కాదు..ఓ బ్యాంక్ ఉద్యోగి. అందరిలాగే ఉద్యోగం చేసుకుంటూ భార్య, పిల్లలతో ఉండేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, ఆయన పూర్తిగా మారిపోయారు. దైవత్వం వైపు మనసు మళ్లింది..తాను సన్యాసిగా మారుతున్నట్లు ప్రకటించుకున్నారు. అంతే… అప్పటి నుంచి తన జీవితాన్ని ఆ మహాశివుడికి అంకితం చేశారు. అయితే, ప్రస్తుతం కనిపించిన ఈ సాధువు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి