King Cobra: కంటి చూపులతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. కనికట్టు విద్యంటే ఇదేనేమో..

కింగ్ కోబ్రాలు మనుషులకు చాలా హానికరం. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే, ఇక్కడ కింగ్ కోబ్రాతో ఓ యువకుడు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

King Cobra: కంటి చూపులతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. కనికట్టు విద్యంటే ఇదేనేమో..
Young man plays with snake
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 26, 2022 | 4:16 PM

King Cobra: ఇంటర్‌నెట్‌ సదుపాయం విపరీతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ తమలోని టాలెంట్‌కి మరింత పదును పెడుతున్నారు. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణల్లో నెట్టింట వాలిపోతుంది. జంతువులు, పాములు, చిన్నపిల్లలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు లెక్కలెనన్ని సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఇకపోతే, ప్రస్తుతం నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి.

పాములంటే చాలా మంది భయంతో వణికిపోతారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా పేరు వింటేనే జనాలు వణికిపోతపారు. దూరం నుంచి చూస్తేనే ప్రాణభయంతో పరుగులుతీస్తారు. ఈ పాములు ఒక్కసారి కాటేస్తే.. మనిషి మరణించడం ఖాయం. కింగ్ కోబ్రాలు మనుషులకు చాలా హానికరం. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే, ఇక్కడ కింగ్ కోబ్రాతో ఓ యువకుడు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు. వైరల్‌ వీడియోలో అతడు పాముతో కలిసి ఆటలాడటం చూసిన నెటిజన్లు ఇది మూర్ఖత్వం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఆ నాగుపాము చాలా పెద్దగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. పక్కనే ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడు నాగుపామును చేతిలో పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్న తీరు చూసి నెటిజన్లు అతడిని పచ్చిపట్టిందా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.కానీ, ఆ కుర్రాడి ముఖంలో భయం జాడ కనిపించలేదు. అతను నిర్భయంగా నాగుపామును పట్టుకుని దానితో డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా, నాగుపాము కూడా బాలుడికి హాని చేయలేదు. ఐతే ఈ వీడియో చూద్దాం.

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

వీడియోను చూస్తుంటే ఈ నాగుపాము బాలుడిని కాటేసి ఉంటే క్షణాల్లో చనిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బాలుడు ఏ మాత్రం భయపడకుండా చేతులతో పట్టుకుని మళ్లీ మళ్లీ దాంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

నాగుపాముతో బాలుడు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఎర్త్‌.రీల్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ అబ్బాయి ఏం నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు? అనే క్యాప్షన్‌ ఇచ్చారు వీడియోకి. ఇక ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓ యూజర్‌పై వ్యాఖ్యానిస్తూ.. ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకునే మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, మరొక వినియోగదారు వ్రాశాడు. ఇది నిజంగా పిచ్చిపనేనంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఓవరాల్ గా ఈ వీడియో చూసిన వారంతా అవాక్కయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి