Viral Video: రోడ్డు మీద వెదవలకు కొదవే ఉండదంటూ అవెర్నెస్‌.. వీడియో వైరల్‌

ఇదిలావుంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు రహదారిపై జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో ఏళ్లుగా వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా

Viral Video: రోడ్డు మీద వెదవలకు కొదవే ఉండదంటూ అవెర్నెస్‌.. వీడియో వైరల్‌
Awareness
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2022 | 8:46 PM

Viral Video: రోడ్డు ప్రమాదాలు తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తున్నప్పటికీ, అవతలి వ్యక్తుల నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుంది. ఒక ప్రమాదం ఎంతోమంది కుటుంబ జీవితాలను పూర్తిగా తలకిందులుగా మార్చేస్తుంది. అయితే, దాని భయం మాత్రం వాహనదారులకు, రోడ్డుపై వెళ్లే వారికి అస్సలు ఉండటం లేదు. రోడ్డుపై ప్రయాణించే వ్యక్తి క్షేమంగా తిరిగి రావాలనే ఉద్దేశ్యంతో వెళితే మనకు వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల సంబంధం లేని వ్యక్తులు వారి కుటుంబాలు బాధపడటం కూడా మనం చూస్తుంటాం.. అక్కడికక్కడే ప్రాణాలు తీసే ప్రమాదాలు అత్యంత ఘోరమైన ప్రమాదాలను ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇదిలావుంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు రహదారిపై జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో ఏళ్లుగా వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. ప్రపంచంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్‌ ఒకటి.

రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించే దిశ‌గా సంబంధిత అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తకు సంబంధించిన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా.. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాల్లో ప్రాణనష్టం కూడా దారి తీస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలో స్పష్టంగా ఉంటేనే దీనిని నివారించవచ్చు. ఈ సందర్భంగా రోడ్డుపై అవగాహన కల్పించే ఓ కామెడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి క్రమరాహిత్యంగా నడుస్తున్నాడు. అటు నుంచి ఇటు నుంచి అటుగా నడుస్తున్నాడు. అప్పుడు అతని వెనుక టూవీలర్‌ వాహనం వస్తున్న ఓ వ్యక్తి తన బండిని అదుపుచేయలేకపోతున్నాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నిర్లక్ష్యంగా నడుస్తున్న కారణంగా బండిపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పుతున్నాడు..కొంచంలో అయితే, అతన్ని ఢీకొట్టేవాడు…కానీ, టూవీలర్‌పై వెళ్తున్న వ్యక్తి బ్యాలెన్స్‌ చేసుకుంటూ..బండికి బ్రేక్‌ వేశాడు. ఆ తర్వాత బండిని పక్కకు ఆపేసి రోడ్డుపై సరిగ్గా నడవని వ్యక్తికి గట్టిగా క్లాప్‌ ఇచ్చాడు.. ఏం బాస్‌ ఈ రోడ్డు ఏమైనా నీకు రాసిచ్చారా..? ఇలా నడుస్తున్నావ్‌ అని గట్టిగా నిలదీశాడు..ఇంకాస్త ఉండుంటే..నాలుగు వేసేవాడేమో..గానీ, ఓ స్ట్రాంగ్‌వార్నింగ్‌ ఇచ్చి వదిలేశాడు..

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి