Viral Video: ఛీ.. మరీ ఇంత దారుణంగా వీడ్కోలు పలుకుతారా ?.. ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థుల ప్రవర్తన అమానవీయం.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. టీచర్‌కి ఫెరవల్‌ పార్టీ ఇస్తున్నారు.. వీడ్కోలు కార్యక్రమంలో ఉపాధ్యాయుడిని విచిత్రంగా తయారు చేశారు విద్యార్థులు.

Viral Video: ఛీ.. మరీ ఇంత దారుణంగా వీడ్కోలు పలుకుతారా ?.. ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థుల ప్రవర్తన అమానవీయం.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..
Farewell
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2022 | 8:15 PM

Viral Video: ఇంటర్నెట్‌లోని ప్రతినిత్యం అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం..అందులో కొన్ని మనల్ని నవ్విస్తాయి. మరికొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. కొన్నిసార్లు షాక్‌కు గురిచేస్తాయి. కొన్నిసార్లు విచారాన్ని కలిగిస్తాయి. అందులో స్కూల్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు ఇలా వారి గురించిన వీడియోలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.. మీ బాధను మరిచిపోయి నవ్వుకునేలా చేసే ఎన్నో వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఆసక్తికరమైన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. పుట్టిన రోజు అయినా, వీడ్కోలు అయినా.. ఏ సందర్భమైనా మనదేశంలో సభను హోరెత్తించే వేడుకలు జరుపుతుంటాం. పుట్టినరోజు వేడుకల్లో పిల్లలు ఒకరిపై ఒకరు కేక్‌తో ఆడుకోవడం మనం చూశాం. అయితే ఇక్కడ ఉపాధ్యాయుని వీడ్కోలులో పార్టీలో విద్యార్థులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు..ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. టీచర్‌కి ఫెరవల్‌ పార్టీ ఇస్తున్నారు.. వీడ్కోలు కార్యక్రమంలో ఉపాధ్యాయుడిని విచిత్రంగా తయారు చేశారు విద్యార్థులు. అది చూస్తే నిజంగా అతనికి దెయ్యం పట్టిందా అని అనిపించేలా కనిపిస్తోంది. విద్యార్థులు,తోటి ఉపాధ్యాయులందరూ కలిసి ఉపాధ్యాయుని ముఖానికి విచిత్రంగా రంగులు వేశారు. అతడిని చూస్తేనే భయపడేంతగా మార్చేస్తారు. ముఖమంతా ఎరుపు రంగు పూసి మెడలో పూలదండాలు, గరిక దండాలు వేశారు. పైగా పక్కనే ఉన్న కొంతమంది విద్యార్థులు అతని కోసం వీడ్కోలు పాట పాడటం చూడవచ్చు. కొందరు విద్యార్థులు నిలబడి అతనిని విచిత్రంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

తన వీడ్కోలులో ఇంత బాధపడే మొదటి గురువు ఆయనే అవుతారని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఈ పాఠశాలకు సంబంధించిన వీడియో Instagram ఖాతా videonation.tebలో అప్‌లోడ్ చేయబడింది. ‘ప్రేమ కాస్త ఎక్కువైంది’ అనే క్యాప్షన్ రాసి వీడియోని పోస్ట్‌ చేశారు. అయితే, ఈ వీడియోలో, ఉపాధ్యాయుడు పాఠశాల నుండి వెళ్లిపోవడంతో విద్యార్థులు కూడా విచారంగా ఉన్నారు. కొందరు విద్యార్థులు ముఖాలు కప్పుకుని ఏడ్వడం కూడా చూడవచ్చు. ఉపాధ్యాయుడు కూడా ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాల, విద్యార్థులను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే అతని ఏడుపుకి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఇకఈ వీడియోకు చాలా లైక్‌లు,వ్యూస్‌ వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి