Heavy Rains: వర్ష బీభత్సం.. వరద నీటిలో రోడ్లపై ఈతకొడుతున్న జనాలు
కుండపోత వర్షంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీటి ప్రవాహం నదులను తలపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని మరోమారు భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. భారీవర్షాల వల్ల రోడ్లను వరద ముంచెత్తడంతో రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. భారీవర్షాల వల్ల శుక్రవారం నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గుర్గావ్‌లో కురిసిన కుండపోత వర్షంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీటి ప్రవాహం నదులను తలపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీ-జైపూర్ హైవేపై ట్రాఫిక్ మెల్లిగా కదులుతోంది.. మరికొన్ని ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వేపై కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో 3,4 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీవర్షాల నేపథ్యంలో ఐఎండీ నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం తర్వాత గురుగ్రామ్‌లోని సుభాష్ చౌక్‌లోని నీటిలో మునిగిన రోడ్డుపై బాలుడు ఈత కొడుతున్న వీడియో ఒకటి బయటపడింది. ఆ బాలుడు నీళ్లతో నిండిన రోడ్డుపై స్నానం చేస్తూ ఈత కొడుతూ కనిపించాడు.
#WATCH | Haryana: Delhi-Gurugram expressway inundated due to waterlogging after heavy rainfall in Gurugram pic.twitter.com/anHlIPWyw0
— ANI (@ANI) September 22, 2022
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో…గురుగ్రామ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇవాళ అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.భారీ వర్షాలకు హర్యానాలోని నర్సింగాపూర్ లో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మోకాలి లోతు నీటిలోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. పార్క్ చేసిన వాహనాలన్నీ వరద దాటికి కొట్టుకుపోయాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి