Viral News: ఛాతీలో నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్ళిన వ్యక్తి.. ఎక్స్‏రే చూసి కంగుతిన్న హాస్పిటల్ సిబ్బంది.. ఎందుకంటే..

అతడి ఛాతిలో ఉన్న ఓ వస్తువును చూసి హాస్పిటల్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఇంతకీ అసలు ఆ వ్యక్తికి ఏం జరిగింది ?. ఎక్స్‏రే చూసి వైద్యులు ఎందుకు షాకయ్యారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.

Viral News: ఛాతీలో నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్ళిన వ్యక్తి.. ఎక్స్‏రే చూసి కంగుతిన్న హాస్పిటల్ సిబ్బంది.. ఎందుకంటే..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2022 | 8:03 PM

నోప్పి అంటూ ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తుల పొట్టలో నుంచి చిన్న కత్తెర, దూది బయటకు తీసిన సంఘటనలు అనేకం చూసి ఉంటాం. ఇటీవల ఓ వ్యక్తి కడుపులో పర్ఫ్యూమ్ బాటిల్ చూసి డాక్టర్స్ షాకయిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు మరోకటి తెరపైకి వచ్చింది. ఛాతిలో నొప్పితో ఆసుపత్రిలోకి వెళ్లిన ఓ వ్యక్తి ఎక్స్‏రే చూసి డాక్టర్స్ కంగుతిన్నారు. అతడి ఛాతిలో ఉన్న ఓ వస్తువును చూసి హాస్పిటల్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఇంతకీ అసలు ఆ వ్యక్తికి ఏం జరిగింది ?. ఎక్స్‏రే చూసి వైద్యులు ఎందుకు షాకయ్యారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఐదు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఓ వస్తువు అతని ఛాతిలో భద్రంగా ఉంది.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న జాయ్ లైకిన్స్ అనే వ్యక్తికి ముక్కుపుడక ఉండేది. అయితే అది ఐదేళ్ల క్రితం ఆకస్మాత్తుగా పోయింది. నిద్రలో ఎక్కడో పడిపోయిందని భావించి దాని గురించి ఆలోచించడం మానేశాడు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఒక రాత్రి విపరీతమైన దగ్గు రావడంతో ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. తన శ్వాసకు ఏదో పడినట్లుగా ఉన్నట్లు భావించాడు. దీంతో ఆసుపత్రికి వెళ్లగా.. అతనిడి పరిక్షీంచిన వైద్యులు న్యుమోనియా లక్షణాలని చెప్పారి. దీంతో అతడి ఛాతిని ఎక్స్ రే తీయగా.. ఊపిరితిత్తుల ఎడమ లోబ్ లోపల 0.6 అంగుళాల నోస్ రింగ్ కనిపించింది. దీంతో వైద్యులతో పాటు జాయ్ లైకిన్స్ సైతం షాకయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం అతడి ఛాతిలో నుంచి ఆ ముక్కు పుడకను తొలగించారు వైద్యులు. తన ఎక్స్ రే ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అనుభవాన్ని వివరించాడు జాయ్ లైకిన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.