Viral Video: ఏటీఎం సెంటర్ సొంతం చేసుకున్న ఆవు.. రచ్చ రచ్చ చేసింది.. డబ్బుల కోసం వచ్చిన వారి కష్టం చూడాలి మరీ..
ఇక్కడ ఒక ATM సెంటర్ గోశాలగా మారింది. నాన్-ఏసీలో పశువుల కొట్టంలో ఉక్కపోత భరించలేక ఆవు హాయిగా ఏసీలో సేదతీరుతుంది. కానీ,
Viral Video: ప్రపంచంలో ఏదైనా జరిగితే, అది సెకన్లలో సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్‌లలో వాలిపోతుంది. ఏదైనా విచిత్రం జరిగితే, అది ఖచ్చితంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి ఘటన ఒకటి వివిధ వేదికలపై వెలుగుచూసి నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తుంది..ఇక్కడ ఒక ATM సెంటర్ గోశాలగా మారింది. నాన్-ఏసీలో పశువుల కొట్టంలో ఉక్కపోత భరించలేక ఆవు హాయిగా ఏసీలో సేదతీరుతుంది. కానీ, అది అంతటితో ఆగలేదు.. ఏటీఎం సెంటర్‌ని పూర్తి గోశాలగా రచ్చరచ్చ చేసేసింది. ఇక క్యాష్ కోసం వచ్చిన కస్టమర్ల తంటాలు చూడాల్సిందే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా గ్రామంలో చోటుచేసుకుంది. ఆవుపేడతో నిండిపోయిన ATM మెషిన్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడంలో స్థానికులు ఇబ్బంది పడుతున్న వీడియోను ఒక జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఏటీఎం సెంటర్‌లోపల ఎటు చూసినా ఆవుపేడతో నిండిపోయింది. ఇక ఆ ఆవు ATM మెషిన్ ముందే పడుకుని ఉంది. మిషిన్‌లో ఉన్న డబ్బంతా నా సొంతమే అన్నట్టుగా ఉంది. ఇక దాంతో ఆ మనిషి తన టీ-షర్టుతో ముక్కు మూసుకుని మెషిన్ నుండి నగదు తీసుకోవడానికి చిన్న శుభ్రమైన ప్రదేశంలో జాగ్రత్తగా అడుగు పెట్టడం మనం వీడియోలో చూడవచ్చు. ఆ వ్యక్తి మేనల్లుడు వీడియో చిత్రీకరించాడని జర్నలిస్టు ట్వీట్‌లో తెలిపారు. ఈ వీడియోకు 36వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆవు గురించి ఆందోళన చెందుతున్న కొంతమంది నెటిజన్లు అనారోగ్యం కారణంగా విరేచనాలు కావచ్చు.. దానిని పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాలండి అంటూ కామెంట్ చేశారు.
एटीएम में गाय ने गोबर किया, नाक बंद किए चाचा का रिएक्शन वायरल
मध्यप्रदेश के रीवा के नईगढ़ी का ये वीडियो वायरल हो रहा है जहां ATM बूथ को गाय ने घर बना रखा है। और एक व्यक्ति नाक दबाए पैसे निकालने पहुंचा है।
ये वीडियो व्यक्ति के भतीजे ने रिकार्ड किया है। pic.twitter.com/084ecYsye2
— Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022
ఇక వీడియో చూసిన ట్విటర్ వినియోగదారులు ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు.AC కారణంగానే ఆవు..అక్కడ ఉందనుకుంటా అంటున్నారు. ATM గార్డు ఎక్కడ ఉన్నారనే విషయంపై దృష్టి పెట్టడం ముఖ్యం అంటున్నారు మరికొందరు నెటిజన్లు. కానీ సాధారణంగా ATM వద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఆవు ఏటీఎం సెంటర్‌లోకి ఎలా ప్రవేశించింది? అంటూ మరొక వినియోగదారు ప్రశ్నించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి