Viral video: బ్రెయిన్ డెడ్ గా ప్రకటించిన వ్యక్తి.. కాళ్లు కదిపాడు.. అంతా అవాక్కయ్యారు.. షాకింగ్ వీడియో..

Viral video: బ్రెయిన్ డెడ్ గా ప్రకటించిన వ్యక్తి.. కాళ్లు కదిపాడు.. అంతా అవాక్కయ్యారు.. షాకింగ్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 27, 2022 | 11:23 AM

అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా


అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్ గానే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. ర్యాన్ మార్లో. పాస్టర్‌గా పని చేస్తున్నాడు. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్‌ఫెక్షన్‌ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్‌ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్‌కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్‌ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది.సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్‌లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించినట్లు స్పష్టమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 27, 2022 09:55 AM