Real life Robinhood: కిక్‌ సినిమాను నిజం చేసిన రియల్‌ దొంగ.. ఎంతో మందికి వైద్యం, పెళ్లుళ్లు జరిపించాడు.. ఎక్కడంటే..

నల్లధనం ఉన్న రాష్ట్రాల్లో దొంగతనాలు చేసేవాడు. అందుకు అతనిపై ఎవరూ ఫిర్యాదు చేయకూడదని ఎమ్మెల్యే ద్వారా మంత్రి నల్లధనాన్ని క్లియర్ చేయించారు.

Real life Robinhood: కిక్‌ సినిమాను నిజం చేసిన రియల్‌ దొంగ.. ఎంతో మందికి వైద్యం, పెళ్లుళ్లు జరిపించాడు.. ఎక్కడంటే..
Robinhood
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2022 | 4:40 PM

Real life Robinhood: హీరో రవితేజ నటించిన కిక్క్‌ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరో ఓ దొంగతనాలు చేయటం చుట్టూనే కథ ఉంటుంది. పేద పిల్లల వైద్యం కోసం అవినీతికి పాల్పడుతున్న మంత్రుల వద్ద డబ్బు దోచుకోవటం లక్ష్యంగా కనిపించింది ఈ మూవీలో. అలాంటి ఓ దొంగ ఘజియాబాద్ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డాడు. దొంగతనం చేసేవాడు.. కానీ, ఆ చోరీలు సమాజ శ్రేయస్సు కోసం చేసేవాడు. ఈ దొంగ చాలా చాకచక్యంగా, టెక్నాలజీని అందినకాడికి వాడేసుకున్నాడు. అతను నల్లధనం భారీగా కూడబెట్టిన వారిని టార్గెట్‌ చేసేవాడు. అలాంటి వారి డబ్బుతో మాత్రమే పేదలకు సాయం చేసేవాడు..పైగా ఈ దొంగపై ఎటువంటి నేరం నమోదు కాలేదు. దాంతో ఇతడు నిజంగానే కిక్ సినిమాలో రవితేజ తరహాలో దొంగతనం సాగిస్తున్నాడనే చెప్పాలి. ఇంతకీ ఎవరా రియల్‌ హీరో.. ఇప్పుడు తెలుసుకుందాం..

పేద పిల్లల వైద్యం కోసం అవినీతికి పాల్పడే మంత్రులను దోచుకుంటూ చోరీకి పాల్పడుతున్న ఓ వెరైటీ దొంగ ఇర్ఫాన్ అలియాస్ ఉజాలేను కవినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన విచారణలో నిందితుడు తన భార్య బిలార్ జిల్లాలోని నగరపంచాయతీ చైర్‌పర్సన్ అని తెలిసింది. అయితే, అతడు వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలు చేసేవాడని అంగీకరించాడు. నల్లధనం ఉన్న రాష్ట్రాల్లో దొంగతనాలు చేసేవాడు. అందుకు అతనిపై ఎవరూ ఫిర్యాదు చేయకూడదని ఎమ్మెల్యే ద్వారా మంత్రి నల్లధనాన్ని క్లియర్ చేయించారు. అంతే కాదు దోచుకున్న సొమ్మును తన గ్రామ అభివృద్ధి పనులకే ఖర్చు చేసేవాడని తెలిపారు. గ్రామంలో రోడ్లు, వీఢి లైట్లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం వంటి ప్రజల అవసరాలన్నీ సమకూర్చేవాడు.

పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నాడు. ఒకవైపు ఇర్ఫాన్ అలియాస్ ఉజాలాపై వివిధ రాష్ట్రాల్లో సుమారు 26 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈరోజు కేవీ నగర్ పోలీసులు అతడిని గ్యాంగ్‌స్టర్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఇకపోతే, ఇర్ఫాన్ ఉజాలేను రాబిన్‌హుడ్ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

గత 10 సంవత్సరాలుగా సూరత్, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, బీహార్‌లలో జాగ్వార్, ఆడి వంటి కార్లను దొంగిలిస్తున్న దొంగ ఇర్ఫాన్ అలియాస్ ఉజాలేను సూరత్ కైమ్ బ్రాంచ్ గత ఆగస్టులో పట్టుకుంది. అతని వద్ద ఒక పిస్టల్‌ ఉన్నట్టుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

2017లో ఢిల్లీ పోలీసులకు ఇర్ఫాన్‌ పట్టుబడినప్పుడు అతడి విలాసాలు వెలుగులోకి రావడం గమనార్హం. ఖరీదైన అభిరుచులు, విలాసవంతమైన జీవితం కోసం అమ్మాయిలతో కాలక్షేపాలు చేసేవాడు. అలాంటి దొంగ..అనేక మంది పేద అమ్మాయిల వివాహాలు, ఆరోగ్య శిబిరాలు, గ్రామంలోని రోడ్ల మరమ్మతులు వంటి అనేక మంచి పనులలో ఆర్థికంగా సహాయం చేసాడని తెలిసింది. అంతేకాదు..అతనిని అక్కడి ప్రజలంతా రాబిన్‌హుడ్ అని పిలుస్తుండేవారని పోలీసు విచారణలో తేలింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి