Viral Video: ఓరి దేవుడో.. రోడ్డుపై వెళ్తున్న మహిళను వెంబడించిన మొక్క.. దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది..

రెస్టారెంట్ లాగా ఉన్న ఓ షాప్ ముందు ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్కనే కుండీలో ఒక పచ్చటి మొక్క కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే,

Viral Video: ఓరి దేవుడో.. రోడ్డుపై వెళ్తున్న మహిళను వెంబడించిన మొక్క.. దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది..
Plant Stood Up
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2022 | 3:53 PM

Viral Video: ఇంటర్నెట్‌ ప్రపంచం అనేక వీడియోలు, ఫోటోలతో నిండి ఉంది. అలాంటి వీడియోల్లో చాలా వరకు నెటిజన్లను నవ్వించేవిగానూ, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. మరికొన్ని ఆసక్తికరంగా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలైతే పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేలా ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా చిలిపి వీడియోలు చూస్తుంటాం. అనేక ప్రాంక్ వీడియోలలో కొంతమంది చేసే చిలిపి పనులు చూసి తెగ ఎంజాయ్‌ చేస్తుంటాం.. ముఖ్యంగా ప్రాంక్‌ వీడియోలు అంటేనే భయపెట్టేవిగా, ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అలాంటి వారు చేసే చిలిపి పనులకు సంబంధిన వీడియోలు కూడా ఇటీవలి కాలంలో బాగా వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోలకు ప్రత్యేక ప్రేక్షకులు ఉంటారు. ఇలాంటి వీడియోలు సాధారణంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో చేస్తారు. చాలా మంది బాటసారులను లక్ష్యంగా చేసుకుని ప్రాంక్‌ చేస్తారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. రెస్టారెంట్ లాగా ఉన్న ఓ షాప్ ముందు ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్కనే కుండీలో ఒక పచ్చటి మొక్క కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఆ మహిళ తన పనిమీద తాను తాపీగా నడుచుకుంటూ..ఆ మొక్క ఉన్న కుండీ వైపు వస్తుంది. కుండీలో ఉన్న మొక్క వద్దకు నడిచే సమయానికి ఆ మొక్క ఒక్కసారిగా లేచి నిలబడింది. ఊహించని విధంగా ఇలా జరగడంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. ఇదేంటి కుండీలోని మొక్క తనపై దాడి చేస్తుందని ఆమె భయపడిపోయింది.  ఊహించిన సంఘటనతో ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. గట్టిగా కేకలు వేసింది.  అయితే, అంతలోనే తెలిసింది అది ప్రాంక్‌ అని…అక్కడ మొక్క రూపంలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. దీంతో చుట్టుపక్కల వాళ్లంతా నవ్వుకోవడం వీడియోలో కనిపించింది. ఇక ఆ తర్వాత సదరు లేడీ ఇలాంటి ప్రాంక్‌ చేసిన వ్యక్తిని చెడమాడా తిట్టేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను షాకింగ్ వీడియోస్ ట్విట్టర్ పేజీలో ఆగస్టు 18న పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 65.5k మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. లైక్ చేశారు.కామెంట్లతో మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లలో తమ టాలెంట్ తో మంచి డాన్సులు, యాక్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చిత్రవిచిత్రమైన, ఫన్నీ ఇన్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు, ఇలాంటి ప్రాంక్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ టాలెంట్ చూపిస్తూ సెలెబ్రిటీలు అవుతుంటే.. మరికొందరు ప్రాంక్ వీడియోస్ పేరుతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నారు. శృతి మించనంతవరకు ఏం పర్లేదు అనుకున్నా..కానీ, ఇలా ప్రాంక్‌ల పేరుతో శృతి మించి చేస్తే మాత్రం ఎదుటివారితో ఎదురయ్యే ఫలితం కూడా గట్టిగానే ఉంటుందని చెప్పటానికి ఈ వీడియో చక్కటి నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి