Wild Elephant: గజరాజు కోపానికి బలైన వృద్ధురాలు.. తొండంతో ఈడ్చికెళ్లి మరీ దారుణం..

పంటపొలాలు ధ్వంసం చేస్తూ రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. గ్రామాలపై దాడిచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. అడ్డొచ్చిన వారిని తొక్కి చంపేస్తుంటాయి.

Wild Elephant: గజరాజు కోపానికి బలైన వృద్ధురాలు.. తొండంతో ఈడ్చికెళ్లి మరీ దారుణం..
Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2022 | 7:44 PM

Wild Elephant: గజరాజుకు కోపం వస్తే బీభత్సం సృష్టిస్తుంది. ఏనుగు దెబ్బ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలాంటి ఏనుగులు తరచూ కొన్ని అటవీ సమీప ప్రాంతాల్లోకి ప్రవేశిస్తూ బీభత్సం సృష్టిస్తుంటాయి. పంటపొలాలు ధ్వంసం చేస్తూ రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. గ్రామాలపై దాడిచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. అడ్డొచ్చిన వారిని తొక్కి చంపేస్తుంటాయి. గజరాజుల దాడిలో రైతులు, అమాయ ప్రజలు ప్రాణాలు కొల్పోయిన సంఘటనలు అనేకం చూశాం..తాజాగా అలాంటి ఘోరమే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జాష్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

త‌క్పారా ఫారెస్ట్ రేంజ్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్యారీ తోపో అనే వృద్ధురాలు పనిమీద బయటకు వచ్చింది. సోమ‌వారం ఉద‌యం ఇంటి నుంచి బ‌య‌టికి వచ్చిన ఆమెకు ఎదురుగా భారీగా ఏనుగు క‌నిపించింది. దాంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన ఆమె తేరుకునే లోపే ఏనుగు ఘోరానికి పాల్ప‌డింది. ఒక్కసారిగా వృద్ధురాలిని తొండంతో పైకెత్తి పడేసింది ఏనుగు..కొంత దూరం వరకు తొండంతో ఈడ్చుకెళ్లింది. ఏనుగు దాడిలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందింది. జరిగిన ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న అట‌వీ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.

త‌క్ష‌ణ సాయం కింద వృద్ధురాలి కుటుంబానికి రూ.25 వేలు అంద‌జేసినట్టుగా అధికారులు తెలిపారు.. సంబంధిత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన త‌ర్వాత మిగ‌తా రూ.5.75 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం కూడా అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఇటీవ‌ల 14 ఏనుగులున్న మంద దారిత‌ప్పి జ‌నావాసాల్లోకి వ‌చ్చింద‌ని, ఈ విష‌యాన్ని అన్ని గ్రామాల‌కు తెలిపి అప్ర‌మ‌త్తం చేశామ‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి