Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Update: ఆధార్ మోసాలకు చెక్ పెట్టేందుకు UIDAI సరికొత్త ప్లాన్.. వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు డేటా బేస్‌..

యూఐడీఏఐ జనన మరణ డేటాను ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. దీని కింద, ఇప్పుడు నవజాత శిశువుకు తాత్కాలిక ఆధార్ నంబర్ జారీ చేయబడుతుంది. తరువాత అది బయోమెట్రిక్ డేటాతో..

Aadhaar Card Update: ఆధార్ మోసాలకు చెక్ పెట్టేందుకు UIDAI సరికొత్త ప్లాన్.. వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు డేటా బేస్‌..
Aadhaar Card Update
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 27, 2022 | 3:40 PM

భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన పత్రం. ప్రభుత్వ పని నుంచి బ్యాంకింగ్ లేదా ఇతర ముఖ్యమైన పని వరకు ఆధార్ తప్పనిసరి. అలాగే, ఆధార్ కార్డ్‌లో ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా అప్‌డేట్ చేయడం మనందరికీ చాలా ముఖ్యం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌కు సంబంధించిన అన్ని రకాల అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటుంది. ఇప్పుడు యూఐడీఏఐ ఆధార్‌కు సంబంధించిన మోసాన్ని నిరోధించడానికి ధన్సు ప్రణాళికను తీసుకువస్తోంది.

యూఐడీఏఐ ధన్సు ప్లాన్!

ఇప్పుడు UIDAI జనన మరణ డేటాను ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. దీని కింద, ఇప్పుడు నవజాత శిశువుకు తాత్కాలిక ఆధార్ నంబర్ జారీ చేయబడుతుంది. తరువాత అది బయోమెట్రిక్ డేటాతో అప్‌గ్రేడ్ చేయబడుతుంది. ఇది మాత్రమే కాదు, మరణాల నమోదు రికార్డును కూడా ఆధార్‌తో అనుసంధానిస్తారు. తద్వారా ఈ నంబర్‌ల దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు డేటా బేస్‌కు జోడించబడుతారు.

రెండు పైలట్ ప్రాజెక్టుల కోసం ప్లాన్..

యూఐడీఏఐ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం, ‘పుట్టుకతో పాటు ఆధార్ నంబర్‌ను కేటాయించడం వల్ల బిడ్డ, కుటుంబం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. దీని వల్ల సామాజిక భద్రత ప్రయోజనాలు ఎవరూ కోల్పోరు. అదేవిధంగా, డెత్ డేటాతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం దుర్వినియోగం నిరోధించబడుతుంది. లబ్దిదారుడు మరణించిన తర్వాత కూడా అతని ఆధార్‌ను ఉపయోగిస్తున్నారని ఇలాంటి అనేక కేసులు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇందుకోసం త్వరలో 2 పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

జీరో ఆధార్ అంటే ఏంటో తెలుసా..?

వాస్తవానికి, యూఐడీఏఐ ఎప్పటికప్పుడు వినియోగదారుల ప్రయోజనం కోసం ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ఇప్పుడు యూఐడీఏఐ కూడా జీరో ఆధార్‌ను కేటాయించాలని యోచిస్తోంది. దీంతో నకిలీ ఆధార్ నంబర్ జనరేట్ కాదు.. అంటే ఎలాంటి ఫోర్జరీ ఉండదు. దీని ప్రకారం, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు కేటాయించబడవు. పుట్టిన, నివాస లేదా ఆదాయ రుజువు లేని వ్యక్తులకు జీరో ఆధార్ నంబర్ ఇవ్వబడుతుంది. డిజిటల్ సైన్ ద్వారా మరొకరికి మీరు ఆధార్‌ను ఇవ్వవచ్చు.

టోల్‌ ఫ్రీ సమయ వేళలు..

ఆధార్‌లో పేరుతో తప్పుగా ఉండటం.. పుట్టిన తేదీ, చిరునామ వంటి వాటిలో తప్పులు దొర్లుతుంటాయి. అలాంటి సమయంలో ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి.. అక్కడ మన నెంబర్ కోసం క్యూలో ఉండటం.. ఆ తర్వాత సరి చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు చాలా మందికి వాటిని సరిదిద్దుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి..? ఎలా సరి చేసుకోవాలి..? అనే విషయాలు సరిగ్గా తెలియవు. ఇలాంటి వారికి హైదరాబాద్‌ యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టిింది. ఆధార్‌కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలుంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా అక్కడ పోస్ట్ చేసింది. అందులో వారిని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని కోరింది. ఏవైనా ప్రశ్నలుంటే టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1947కు సంప్రదించాలని తెలిపింది.

సెలవు దినాల్లో కూడా..

ప్రతి రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని తెలిపింది. అలాగే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్‌ ప్రీ నెంబర్‌ పని చేస్తుందని.. ఇందులో సంప్రదించాలని కోరింది. ఏమైనా ప్రశ్నలుంటే సమాధానం అందుకోవాలని ట్వీట్‌లో పేర్కొంది. IVRS మోడ్‌లో ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 24X7, 365 రోజులు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలకైనా వారు సమాధానం ఇస్తారు. ఇందుకు సలహాలు, సూచనలు పొందవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..