Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022: ఇదో వింత ఆచారం..అక్కడ పురుషులు చీరలు ధరించి ‘గర్బా’ నృత్యం చేస్తారు.. ఎందుకో తెలుసా?

ఆమె శాపం ఇప్పటికీ శక్తివంతమైనదని స్థానికులు నమ్ముతున్నారు. ఆమెను శాంతింపజేయడానికి, ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడ పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెను క్షమాపణ కోరతారు.

Navratri 2022:  ఇదో వింత ఆచారం..అక్కడ పురుషులు చీరలు ధరించి ‘గర్బా’ నృత్యం చేస్తారు.. ఎందుకో తెలుసా?
In Unique Navratri Traditio
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2022 | 9:16 PM

Navratri 2022: దేశవ్యాప్తంగా నవరాత్రి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు, ప్రతి ప్రాంతం ఆయా ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయంలో, తొమ్మిది రోజుల నవరాత్రి పండుగలో ఎనిమిదవ రాత్రి ఓ వింత ఆచారం కొనసాగుతుంది. నవరాత్రి సమయంలో గుజరాత్‌లో ‘గర్బా’ నృత్యం చేయడం ఆనాదిగా వస్తోంది. సంప్రదాయ బట్టలు ధరించిన మహిళలు అమ్మవారి పాటలపై గర్బా ప్రదర్శిస్తుంటే, పురుషులు కూడా వారితో నృత్యం చేయడం కనిపిస్తుంది. అయితే అహ్మదాబాద్‌లో కూడా 200ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అక్కడి పురుషులు చీర కట్టుకుని గర్బా చేస్తారు. అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో నివసించే ‘బారోట్ కమ్యూనిటీ’ ప్రజలు ‘సదుబా మాత’ను పూజిస్తారు. అష్టమి రోజున ఇక్కడి పురుషులు చీరలు ధరించి గర్బా చేస్తారు. ఇది బారోట్ కమ్యూనిటీ ప్రజలు దేవత పట్ల తమ కృతజ్ఞతను తెలియజేసే సంప్రదాయం. ఇది 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం.

నమ్మకాల ప్రకారం.. ‘సదుబా’ అనే మహిళ చాలా సంవత్సరాల క్రితం బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు తన గౌరవాన్ని కాపాడటానికి సహాయం చేయడానికి నిరాకరించినప్పుడు వారికి శాపం ఇచ్చిందని చెబుతారు. ఈ క్రమంలో ఆమె తన బిడ్డను పోగొట్టుకున్నట్లు సమాచారం. ఆమె శాపం ఇప్పటికీ శక్తివంతమైనదని స్థానికులు నమ్ముతున్నారు. ఆమెను శాంతింపజేయడానికి, ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడ పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెను క్షమాపణ కోరతారు. పురుషులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి చీరలో నృత్యం చేస్తారని స్థానికులు నమ్ముతారు. వారు తమ పిల్లల దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి