Online Shopping: ఆన్ లైన్ లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టాడు.. కానీ వచ్చింది చూసి అవాక్ అయ్యాడు..
ఓ వ్యక్తి తాను ఆన్‌లైన్ రిటైలర్ నుండి తనకు కావాల్సింది ఆర్డర్ చేయగా, దానికి బదులు అతడు అందుకున్న పార్శిల్‌లో మరో వస్తువు కనిపించింది. పార్శిల్ ఓపెన్ చేసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు.
Online Shopping: ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఏది కావాలన్నా ఇంట్లో అరచేతిలోని ఫోన్‌తో ఆర్డర్ పెడితే చాలు.. అనుకున్న సమయానికి మీ వాకిట్లో వాలిపోతున్నాయి. ఉప్పు, పప్పులు మొదలు, వండిన ఆహారాల వరకు ఇప్పుడన్నీ ఆన్‌లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా అప్పుడప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు ఆర్డర్ పెడితే మరొకటి డెలివరీ అవ్వడం… అది చూసి సదరు కస్టమర్ ఆగ్రహంతో ఊగిపోవటం, కంపెనీకి ఫోన్ చేసి చెడామడా తిట్టేయడం కూడా సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, బీహార్‌లోని ఓ వ్యక్తి తాను ఆన్‌లైన్ రిటైలర్ నుండి తనకు కావాల్సింది ఆర్డర్ చేయగా, దానికి బదులు అతడు అందుకున్న పార్శిల్‌లో మరో వస్తువు కనిపించింది. పార్శిల్ ఓపెన్ చేసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇదేంటనీ అవాక్కయ్యాడు..ఇంతకీ అతను ఆర్డర్ పెట్టిన వస్తువులు ఏంటీ..? అతని అందిన వస్తువు మరెంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నడుస్తుంది. లాభదాయకమైన ఆఫర్‌లు, తగ్గింపుల ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి బ్రాండ్‌లు అన్ని విధాలుగా వెళ్తున్నాయి. సేల్ సీజన్ ముగియడంతో కస్టమర్లు కూడా మంచి డీల్‌ను పొందేందుకు షాపింగ్ వెబ్‌సైట్‌లకు తరలివస్తున్నారు. అయితే,ఆన్‌లైన్ షాపింగ్‌తో కొందరు మోసపోవటం కూడా జరుగుతుంది. ఒక ఢిల్లీ వ్యక్తి ల్యాప్‌టాప్‌కు బదులుగా డిటర్జెంట్ బార్‌లను ఎలా అందుకున్నాడనే కథనం గతంలోనే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బీహార్‌లో కూడా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది.
నలందాలోని పర్వాల్‌పూర్‌లో ఒక వ్యక్తి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నుండి డ్రోన్ కెమెరాను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. దాంతో డ్రోన్ కెమెరాకు బదులుగా అతనికి ఒక కిలో బంగాళాదుంప పార్శిల్ అందింది. పర్వాల్‌పూర్‌కు చెందిన చైతన్య కుమార్ అనే వ్యక్తి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నుండి తగ్గింపు ధరకు డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. అతను ఆర్డర్ చేసిన డ్రోన్ కెమెరా మార్కెట్ విలువ రూ. 84,999 అయితే సదరు కంపెనీ ఆఫర్‌లో మాత్రం కేవలం రూ.10,212కే లభిస్తుంది. అతను ముందుగా అనుమానం వ్యక్తం చేశాడు. కానీ, కంపెనీతో స్పష్టత తీసుకున్న తర్వాతే అతడు డ్రోన్ కెమెరాను కొనుగోలు చేశాడు. భారీ ఆఫర్ ఉందని అందుకే తక్కువ ఖర్చుతో కెమెరాను తీసుకుంటున్నానని సదరు సంస్థ చెప్పిన మాటలను నమ్మానని చెప్పాడు. అందుకు గానూ అతడు దాని మొత్తం ధర పూర్తిగా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేశాడు.
ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India
पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb
— UnSeen India (@USIndia_) September 26, 2022
వీడియోలో కస్టమర్ తాను రికార్డ్ చేస్తున్నప్పుడు పార్శిల్‌ను అన్‌బాక్స్ చేయమని డెలివరీ ఎగ్జిక్యూటివ్ సూచించారు.. డెలివరీ బాయ్ పార్శిల్ తెరిచి చూడగా అందులో డ్రోన్ కెమెరాకు బదులు 10 బంగాళదుంపలు కనిపించాయి. దీనిపై డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన పాత్ర లేదని చెప్పుకొచ్చాడు. దీంతో సదరు కస్టమర్ పర్వాల్‌పూర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ దరఖాస్తు అందిన తర్వాత ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి